Kamal Haasan K Viswanath : గురువును కోల్పోయాను – కమల్
శరీరంలో ఒక భాగం కోల్పోయా
Kamal Haasan K Viswanath : కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నారు దిగ్గజ నటుడు కమల్ హాసన్. ఇటీవలే ఆయనను కలుసుకున్నా. ఆనాడు కె.విశ్వనాథ్ కలిసి నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నానని చెప్పారు. అద్భుతమైన దర్శకుడని, నటనా పరంగా తాను ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. ఆయన నాకు గురువే కాదు ఒక రకంగా తండ్రి సమానులంటూ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. కె. విశ్వనాథ్ ను కలిసిన సందర్భంగా ఆశీర్వాదం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు అరుదైన ఫోటోను షేర్ చేశారు. ఆయన తనకు మాస్టర్ అని పేర్కొన్నారు కమల్ హాసన్(Kamal Haasan). కళాతపస్వి దర్శకత్వంలో మూడు సినిమాలలో నటించారు లోక నాయకుడు. అందులో ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచి పోయే చిత్రాలు ఉన్నాయి. వాటిలో సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం లలో కమల్ హాసన్ నటించారు.
కె.విశ్వనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా చరిత్రలో తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా విచిత్రం ఏమిటంటే కె.విశ్వనాథ్ కూడా కమల్ హాసన్ కు చెందిన రెండు చిత్రాలలో నటించారు. కురుతిపునల్ , ఉత్తమ విలన్ లలో నటించారు.
తర్వాతి కాలంలో కళాతపస్వి కమల్ హాసన్ కు మామ పాత్రలో నటించారు. ఆయన ఆత్మ శాంతికి భగవంతుడు శాంతి చేకూరాలని కోరుకుతున్నానని పేర్కొన్నారు కమల్ హాసన్.
Also Read : తండ్రిని కోల్పోయాను – చిరంజీవి