Kamal Haasan : క్వీన్ ను తలుచుకున్న కమల్ హాసన్
ఆమెను కోల్పోవడం బాధాకరం
Kamal Haasan : బ్రిటన్ కు సుదీర్ఘ కాలం పాటు రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ -2(Queen Elizabeth II) కన్ను మూశారు. ఆమెకు 96 ఏళ్లు. పరిపాలనా పరంగా తనదైన ముద్ర వేశారు.
ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలిజబెత్ మృతికి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ రాణి లోకాన్ని వీడడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు కమల్ హాసన్.
ఆమెతో కలుసుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆమెతో దిగిన ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేశారు కమల్ హాసన్. ఎలిజబెత్ తో తన రెండో సమావేశం నుండి ఓ చిత్రాన్ని పోస్ట్ చేశాడు.
ఒకసారి తాను షూటింగ్ లో ఉండగా సడెన్ గా యుకె క్వీన్ సందర్శించారు. తనను ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు. తన సినీ కెరీర్ లో మరిచి పోలేని సన్నివేశంగా మిగిలి పోతుందన్నారు కమల్ హాసన్(Kamal Haasan).
2017 లో కమల్ హాసన్ బకింగ్ హామ్ ప్యాలెస్ సందర్శించిప్పటి దానిని గుర్తు తెచ్చుకున్నారు. 1997లో భారత దేశ పర్యటన సందర్భంగా నటుడు ఆమెను తిరిగి కలుసుకున్నారు.
కమల్ హాసన్ తన అసంపూర్తి చిత్రం మరుదనాయకం సెటల్ సందర్శించనప్పుడు తన ట్వీట్ లో గుర్తు చేసుకున్నాడు. తమిళంలో ట్వీట్ చేశారు.
బహుశా ఆమె హాజరైన ఏకైక సినిమా షూట్ మాత్రమేనని పేర్కొన్నారు కమల్ హాసన్. ఇంగ్లండ్ క్వీన్ ఎలిజబెత్ -2 మరణవార్త విని నేను చాలా బాధ పడ్డానని తెలిపారు. ఆమెను బ్రిటీషర్లు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ప్రేమిస్తారని కొనియాడారు దిగ్గజ నటుడు.
Also Read : యశోద మూవీలో గర్భిణీగా సమంత