Kamran Akmal : ఉమ్రాన్ మాలిక్ పై అక్మ‌ల్ కామెంట్

పాకిస్తాన్ లో పుట్టి ఉంటే బాగుండేది

Kamran Akmal : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2022లో ఒకే ఒక్క‌డి పేరు టాప్ లో నిలిచేలా చేసింది. అత‌డు ఎవ‌రో కాదు జ‌మ్మూ కాశ్మీర్ కు చెందిన మార‌థాన్ ఎక్స్ ప్రెస్ స్టార్ పేస‌ర్ ఉమ్రాన్ మాలిక్ (Kamran Akmal)  .

గంట‌కు 155 కిలోమీట‌ర్ల వేగంతో బంతుల్ని విసురుతూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తూ చుక్క‌లు చూపిస్తున్నాడు. ఇప్ప‌టికే ఆడిన ప్ర‌తి మ్యాచ్ లో ప‌రుగులు ధార‌ళంగా ఇస్తున్న‌ప్ప‌టికీ వికెట్లు తీయ‌డంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

అత‌డి బౌలింగ్ కు విస్తు పోయిన తాజా, మాజీ క్రికెట్ ఆట‌గాళ్లే కాదు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సైతం ఉమ్రాన్ మాలిక్(Kamran Akmal)  ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

అత‌డిని జాతీయ జ‌ట్టుకు తీసుకోవాల‌ని, త్వ‌ర‌లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఎంపిక చేయాల‌ని కోరుతున్నారు.

ఇలా కోరిన వారిలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ పి. చిదంబ‌రం, కేర‌ళ కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్, తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నారు.

వీరంతా మాలిక్ బౌలింగ్ కు ఫిదా అయ్యారు. తాజాగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ ఉమ్రాన్ మాలిక్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

మాలిక్ గ‌నుక తమ దేశంలో పుట్టి ఉండి ఉంటే ఎప్పుడో జాతీయ జ‌ట్టుకు ఆడేవాడ‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం భార జ‌ట్టుకు పేస‌ర్లు ఉన్నార‌ని, మాలిక్ ను ఎంపిక చేస్తే బావుండేదని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

ఇక ఐపీఎల్ లో ప‌ర్పుల్ క్యాప్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన యుజ్వేంద్ర చాహ‌ల్ టాప్ లో ఉండ‌గా ఆ త‌ర్వాతి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు.

 

Also Read : క‌గిసో ర‌బాడ అరుదైన ఘ‌న‌త

Leave A Reply

Your Email Id will not be published!