Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రిపై నడుస్తున్న దుర్గమ్మ పవిత్రోత్సవాలు

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు...

Kanaka Durga Temple : ప్రసిద్ధి పుణ్యక్షత్ర ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు జరుగతుండటం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది కాలంలో ఆలయానికి ఎటువంటి అపరివితం జరిగిన వాటిని శుద్ధి చేసే కార్యక్రమంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయంలోని దేవతామూర్తులు అన్నిటికీ పవిత్ర ఉత్సవాల సమర్పణ చేస్తారు. రేపు పూర్ణాహుతితో పవిత్ర ఉత్సవాలు ముగియనున్నాయి. శ్రావణమాసంలో నూతన వధూవరులకు ఉచిత ఆశీర్వచనం ప్రసాదాన్ని ఆలయ యాజమాన్యం అందిస్తోంది.

Kanaka Durga Temple Ustavams..

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ పౌర్ణమి పైగా సోమవారం కావడంతో భారీగా భక్తజనం తరలివచ్చారు. ఈ క్రమంలో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టనుంది. నిన్న,నేడు భక్తులకు స్పర్శ దర్శనానికి కూడా అవకాశం కల్పించడంతో భక్తుల రద్దీ పెరిగింది.

Also Read : Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ని వెంటాడుతున్న మరో 3 కేసులు

Leave A Reply

Your Email Id will not be published!