Kane Williamson : మానని గాయం విలియమ్సన్ భావోద్వేగం
ఐపీఎల్ నుంచి వెళ్లిపోతున్నా
Kane Williamson : ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా వినుతి కెక్కాడు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్. క్రికెటర్ గానే కాదు మనస్సున్న ఆటగాడు. ఎందరికో గుప్త దానాలు చేయడంలో ముందంజలో ఉన్న ఏకైక క్రికెటర్. పాకిస్తాన్ లో వరద బాధితులకు, క్యాన్సర్ రోగులకు ఇలా తనకు వచ్చిన దాంట్లో సాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకత కలిగి ఉన్నాడు కేన్ విలియమ్సన్(Kane Williamson).
భారత్ లో జరుగుతున్న 16వ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కేన్ మామ. ఎప్పటికీ నవ్వుతూ నవ్విస్తూ చాలా కూల్ గా ఉండే అలవాటు విలియమ్సన్ కు. అందుకే అతడంటే చాలా మంది క్రికెటర్లకు వల్లమాలిన అభిమానం. అంతే కాదు ప్రత్యర్థి జట్లకు కూడా ఎనలేని ప్రేమ.
టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడింది. ఆ జట్టు తొలి బోణీ కొట్టింది. కానీ చెన్నై బ్యాటర్ షాట్ ను ఆప బోయిన కేన్ విలియమ్సన్(Kane Williamson) గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం పోస్ట్ చేసింది ట్విట్టర్లో. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఈ సందర్బంగా కేన్ విలియమ్సన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్ నుంచి వీడుతున్నందుకు బాధగా ఉందన్నాడు.
Also Read : రాజస్థాన్ దెబ్బకు కావ్య విలవిల