Kane Williamson : స్వదేశానికి కేన్ మామ పయనం
ప్రకటించిన సన్ రైజర్స్ మేనేజ్ మెంట్
Kane Williamson : ఐపీఎల్ ఇంకా ముగియకుండానే ప్లే ఆఫ్స్ తేలకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యాడు.
లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ పై ఉత్కంఠ భరిత పోరులో 3 పరుగుల తేడాతో గెలుపొంది ఎస్ ఆర్ హెచ్. ఇంకో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాగా ప్లే ఆఫ్స్ ఆశలు కొద్దిగా మిణుకు మిణుకు మంటున్నాయి.
వ్యక్తిగత కారణాల రీత్యా తాను వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నాడు కేన్ విలియమ్సన్. కేన్(Kane Williamson) మామ సతీమణి సారా రహీం రెండో బిడ్డకు జన్మనిస్తుండడంతో ఆమె కు తోడుగా తాను తప్పక ఉండాల్సి ఉందని ఈ మేరకు మేనేజ్ మెంట్ కు స్పష్టం చేశాడు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేన్ విలియమ్సన్(Kane Williamson) కు పర్మిషన్ ఇచ్చింది ఆ జట్టు సిఇఓ కావ్య మారన్. ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే హైదరాబాద్ జట్టు ఈనెల 22న పంజాబ్ కింగ్స్ తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఒక వేళ ఆ జట్టుపై గెలిచి, మిగతా జట్లు ఓడి పోతే గనుక ఎస్ ఆర్ హెచ్ కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ జట్టును ఎవరు నడిపిస్తారనేది ఉత్కంఠగా మారింది.
ఇప్పటికే పలు జట్లు పేలవమైన ఆట తీరుతో నిరాశకు గురి చేశాయి. ఇక కేన్ విలియమ్సన్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ లేదా నికోలస్ పూరన్ లలో ఎవరో ఒకరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నట్లు టాక్.
మొత్తంగా కేన్ మామ వెళ్లి పోయిన విషయాన్ని సన్ రైజర్స్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Also Read : భారత్ టూర్ కు సఫారీ రెడీ