Kangana Ranaut : మహేష్ అన్నదాంట్లో తప్పేముంది
వివాదాస్పద నటి కంగనా రనౌత్
Kangana Ranaut : ప్రముఖ బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె ప్రిన్స్ మహేష్ బాబుకు బాసటగా నిలిచారు.
అంతా బాలీవుడ్ పై ఫోకస్ పెడుతుంటే మీరెందుకు ఇక్కడ నటించడం లేదంటూ అడిగిన ప్రశ్నకు ప్రిన్స్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.
తనకు టాలీవుడ్ అయితేనే కంఫర్ట్ అని, తనను బాలీవుడ్ భరించ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్టార్ హీరో మహేష్ బాబు చేసిన కామెంట్స్ బాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయనకు మద్దతుగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ నిలిచారు. బాబు అన్నదాంట్లో తప్పేమీ లేదన్నారు.
ఇదే సమయంలో కంగనా రనౌత్ స్పందించారు. తను నటించిన థాకడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహేష్ బాబు ఆలోచించి అన్నారని, ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు కంగనా రనౌత్.
నేను కూడా బేషరతుగా ప్రిన్స్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మహేష్ బాబు బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు అక్షరాల వంద శాతం కరెక్టు. ఎందుకంటే ఆయనను భరించడం చేత కాదని (Kangana Ranaut)పేర్కొంది.
బాలీవుడ్ నుంచి ఎంతో మంది ఆయనతో సినిమా కోసం సంప్రదించారో తనకు తెలుసు అని చెప్పింది కంగనా రనౌత్. ప్రస్తుతం టాలీవుడ్ దేశంలోనే నెంబ్ వన్ లో ఉంది.
ఈ తరుణంలో ప్రిన్స్ అడిగే రెమ్యూనరేషన్ ను ఇచ్చే స్థితిలో బాలీవుడ్ లేదని కుండ బద్దలు కొట్టింది.
Also Read : నయన్ మూవీకి ధోనీ నిర్మాత