Kapil Dev : పాలిటిక్స్ కు దూరం ఆటే ప్రాణం – కపిల్ దేవ్
క్లారిటీ ఇచ్చిన భారత క్రికెట్ మాజీ కెప్టెన్
Kapil Dev : భారత క్రికెట్ మాజీ కెప్టెన్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నిఖంజ్ సంచలన కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీంతో ఆ ప్రచారం పూర్తిగా అబద్దమని, వాస్తవం కాదన్నారు కపిల్ దేవ్(Kapil Dev). ఆదివారం కపిల్ దేవ్ స్పందించారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలుపనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు.
ఇది సత్య దూరమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాళ్లు మహమ్మద్ అజహరుద్దీన్ , నవ జ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
ఇక గౌతం గంభీర్ బీజేపీ ఎంపీగా ఉండగా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు ఇప్పుడే తెలిసిందని తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, తాను పూర్తిగా ఈ దేశం పట్ల నమ్మకం, గౌరవం, ప్రేమ కలిగిన స్వచ్ఛమైన క్రీడాకారుడినని, భారతీయుడినని స్పష్టం చేశారు కపిల్ దేవ్.
తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నాడు. ప్రజలు తప్పుడు వార్తలు నమ్మకండి. అలాంటిది ఏది ఉన్నా తాను బహిరంగంగా ప్రకటిస్తానని చెప్పాడు కపిల్ దేవ్ నిఖంజ్.
ఈ మేరకు తన స్పందనను తన ఇన్ స్ట్రా గ్రామ్ లో కూడా పోస్ట్ చేశాడు . ఈ విషయాన్ని స్పష్టంగా తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నాడు కపిల్ దేవ్(Kapil Dev).
ఇదిలా ఉండగా ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కపిల్ దేవ్ కలిసి దిగిన ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో కపిల్ దేవ్ ఆప్ లో చేరుతారని ప్రచారం చోటు చేసుకుంది.
Also Read : రిషబ్ పంత్ కు కోచ్ పాంటింగ్ సపోర్ట్