Kapil Dev : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ తరం ఆటగాళ్లలో తాను రవీంద్ర జడేజా ఆట తీరును ఎక్కువగా ఇష్ట పడతానని తెలిపాడు.
స్వదేశంలో శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 175 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కీలక వికెట్లు పడగొట్టాడు. ఇదే సమయంలో 33 ఏళ్ల కిందట తనపై నమోదైన రికార్డును జడేజా బద్దలు కొట్టాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో టెస్ట్ క్రికెట్ లో ఆల్ రౌండర్ ర్యాంక్ లో నంబర్ 1 గా ఉన్నాడు. ఒకే టెస్టు మ్యాచ్ లో 9 వికెట్లు పడగొట్టి 150కి పైగా పరుగులు చేసిన క్రికెటర్ గా రవీంద్ర జడేజా నిలిచాడు.
ఫరీదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ దేవ్ (Kapil Dev )ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడాడు. కొత్తగా వస్తున్న ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ఆటను తాను అమితంగా ఇష్ట పడతానని చెప్పాడు కపిల్ దేవ్.
ఎందుకంటే జడ్డూ ఎలాంటి ఒత్తిడి అన్నది లేకుండా ఆడటం తనను బాగా ఆకట్టుకుందన్నాడు. ప్రత్యేకించి ఆట పట్ల అతడికి పేషన్ ఉంది. క్రికెట్ ఆటను బాగా ప్రేమిస్తాడని పేర్కొన్నాడు. జడ్డూ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ , ఫీల్డింగ్ లో రాణిస్తున్నాడని తెలిపాడు.
ఒత్తిడి వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నాడు. అందుకే జడేజా కూల్ గా ఉంటూ తన పని తాను చేసుకు పోతున్నాడంటూ కితాబు ఇచ్చాడు కపిల్ దేవ్. మొత్తంగా జడేజాపై పొగడ్తల వర్షం కురిపించడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం.
Also Read : పంత్ సూపర్ అయ్యర్ అదుర్స్