Kapil Dev : పేర్లు ఫేమ‌స్ ఆట తీరు బేవార్స్ – క‌పిల్ దేవ్

కోహ్లి..రోహిత్..రాహుల్ పై షాకింగ్ కామెంట్స్

Kapil Dev : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, దిగ్గ‌జ క్రికెట‌ర్ గా పేరొందిన క‌పిల్ దేవ్(Kapil Dev) నిఖంజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయ‌న నిబ‌ద్ద‌త క‌లిగిన క్రికెట‌ర్. ఎవ‌రి ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌రు. కానీ దేశం కోసం ఆడే ఆట‌గాళ్లు ఆట ప‌ట్ల నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తే మాత్రం త‌ట్టుకోలేరు.

క‌పిల్ దేవ్ కు దేశం అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అంత‌కంటే క్రికెట్ అంటే ప‌డి చ‌చ్చేంత ఇష్టం. మ‌రి ఆయ‌నకు ఈమ‌ధ్య తీవ్రంగా కోపం వ‌చ్చింది. ఎవ‌రి మీద‌నంటే ఆ ముగ్గురు ఆట‌గాళ్ల మీద‌.

ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శ‌ర్మ‌ల‌ను ఏకి పారేశాడు. పేరేమో గొప్ప‌గా ఉంది. కానీ ఆట తీరు మాత్రం అధ్వాన్నంగా ఉంద‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

యావ‌త్ దేశం మీ ఆట కోసం ఎదురు చూస్తోంది. మీరేమో అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో ఆడుతున్నారంటూ సీరియ‌స్ అయ్యారు. ఇక‌నైనా ఆట‌పై ఫోక‌స్ పెట్టాల‌ని లేక పోతే జ‌ట్టులో నెగ్గుకు రావ‌డం క‌ష్టం అవుతుంద‌ని పేర్కొన్నాడు క‌పిల్ దేవ్.

అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఈ ముగ్గురు ఆడ‌డం లేద‌ని, చేతులెత్తేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక ఉండీ ఏం లాభం అని ప్ర‌శ్నించారు క‌పిల్ దేవ్(Kapil Dev). రోహిత్, కోహ్లీ ఆట తీరు ఇత‌ర ఆట‌గాళ్ల‌పై ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు.

ఐపీఎల్ లో కోహ్లీ, రోహిత్ శ‌ర్మ చేతులెత్తేశారు. దిగ్గ‌జ ఆట‌గాళ్లు వాళ్ల‌పై ఒత్తిడి త‌ప్ప‌కుండా ఉంటుంది. కానీ ప‌రుగులు చేయ‌లేక పోతే ఎక్కువ కాలం నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌ని పేర్కొన్నాడు.

Also Read : 10 వేల ప‌రుగుల క్ల‌బ్ లో జో రూట్

Leave A Reply

Your Email Id will not be published!