Karnataka Guarantee : క‌ర్ణాట‌క గ్యారెంటీ కాంగ్రెస్ లో జోష్

రేపే కీల‌క క్యాబినెట్ మీటింగ్

Karnataka Guarantee : భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చి ఊహించ‌ని రీతిలో అతి పెద్ద ఏకైక పార్టీగా అవ‌త‌రించింది కాంగ్రెస్ పార్టీ. అంతే కాదు సీట్లు పొంది కింగ్ మేక‌ర్ గా మారుదామ‌ని క‌ల‌లు క‌న్న జేడీఎస్ చీఫ్ , మాజీ సీఎం కుమార‌స్వామి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. 224 సీట్ల‌కు గాను 135 సీట్లు సాధించింది. ఔరా అనిపించేలా షాక్ ఇచ్చింది. ఓ వైపు డీకే శివ‌కుమార్ ఇంకో వైపు సిద్ద‌రామ‌య్య ఫేస్ వాల్యూ చివ‌ర‌కు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వ‌చ్చేలా చేసింది.

ఇక నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ ముందుకు సాగేలా చేసిన వారిలో రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ ర‌ణ్ దీప్ సూర్జే వాలా, పొలిటిక‌ల్ స్ట్రాటజిస్ట్ సునీల్ క‌నుగోలు వ్యూహాలు ప‌ని చేశాయి. ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేలా చేశాయి. ప్ర‌ధానంగా పార్టీ తయారు చేసిన మేనిఫెస్టో దేశం త‌న వైపు చూసేలా చేసింది. ఓట్ల వ‌ర్షం కురిపించేలా చేసింది. దీంతో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తాము ఇచ్చిన 5 హామీల‌ను అమ‌లు చేసే ప‌నిలో ప‌డింది. ఇవాల్టి నుంచి క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన మ‌హిళ‌లకు ఉచిత ప్ర‌యాణం వ‌ర్తింప చేస్తోంది.

అంతే కాదు ఆక‌లి తీర్చేందుకు అన్న భాగ్య‌ను ప్ర‌వేశ పెడుతోంది. మ‌రో వైపు ఇందిర‌మ్మ క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం. ఇదిలా ఉండ‌గా జూన్ 2న కీల‌క మంత్రివ‌ర్గం స‌మావేశం ఉంది. ఇందులో క‌ర్ణాట‌క గ్యారెంటీ(Karnataka Guarantee)పై స్ప‌ష్టత రానుంది. క‌ర్ణాట‌క స‌క్సెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓ మంత్రంగా మార‌నుంది.

Also Read : Janasena Focus

 

Leave A Reply

Your Email Id will not be published!