Telangana Formation : తెలంగాణం అలుపెరుగ‌ని ప్ర‌స్థానం

ఎన్నో మైలు రాళ్లు..జ్ఞాప‌కాలు

Telangana Formation : ఉద్య‌మాల‌కు, పోరాటాల‌కు ఊపిరి పోసింది తెలంగాణ‌(Telangana). స‌మున్న‌త ల‌క్ష్యంతో నీళ్లు, నిధులు ,నియామకాల ట్యాగ్ లైన్ తో సాగించిన ఉద్య‌మం చ‌రిత్ర సృష్టించింది. దీనికి నాయ‌క‌త్వం వ‌హించిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సాధ‌కుడిగా, విజేత‌గా నిలిచి పోయారు. ఆయ‌న స్థాపించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ఓ ప్ర‌భంజ‌నం సృష్టించింది. స‌రిగ్గా ఇదే రోజు జూన్ 2న 2014న తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించింది. ఈ మ‌హోద్యమంలో ఎంద‌రో రాలి పోయారు. మ‌రికొంద‌రు బ‌లిదానం చేసుకున్నారు. తొలి ద‌శ ఉద్య‌మంలో శ్రీ‌పాదాచారి, మ‌లి ద‌శ పోరాటంలో శ్రీ‌కాంతాచారి ఆత్మ త్యాగం కోట్లాది మంది గుండెల్ని ర‌గిలించింది.

రాష్ట్రం ఏర్ప‌డి తొమ్మిది సంవ‌త్స‌రాలు అవుతోంది. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారి పోయింది. తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ఉత్స‌వాల‌కు ముస్త‌బ‌వుతోంది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్ప‌డింది. ఇది చారిత్రిక సంద‌ర్బం. శుక్ర‌వారం తెలంగాణ దినోత్స‌వానికి సిద్ద‌మైంది. ముస్తాబైంది. ఈ రోజు అత్యంత ముఖ్య‌మైన‌ది కూడా. 33 జిల్లాలు క‌లిగి ఉంది. సాహిత్య‌, సామాజిక‌, రాజ‌కీయ చైత‌న్యానికి ప్ర‌తీకగా నిలిచింది తెలంగాణ‌.

ఉమ్మ‌డి ఏపీలో 294 స్థానాలు ఉండ‌గా రెండు రాష్ట్రాలు విడి పోయాక సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో పాత వాటితో క‌లుపుకొని మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. చ‌రిత్ర ప‌రంగా చూస్తే 1948లో భార‌త దేశం నిజాం పాల‌న‌కు ముగింపు ప‌లికి హైద‌రాబాద్ రాష్ట్రంగా ఏర్ప‌డింది. 1956లో తెలంగాణ భాగం అప్ప‌టి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేశారు. మిగిలిన భాగాలు క‌ర్ణాట‌క‌, మ‌రాఠాలో విలీన‌మ‌య్యాయి. పొట్టి శ్రీ‌రాములు చేప‌ట్టిన ఆమ‌ర‌ణ దీక్ష‌తో ఏపీ ఏర్ప‌డింది. మొద‌టి భాషా ప‌రంగా ఏర్ప‌డిన రాష్ట్రంగా చ‌రిత్రలో నిలిచింది. 2001లో టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు కేసీఆర్. ఉద్య‌మ కారుడిగా మొద‌లై రాష్ట్రానికి సీఎంగా ఎన్నిక‌య్యేంత వ‌ర‌కు తెలంగాణ ప్ర‌స్థానం సాగింది.

Also Read : Karnataka Guarantee

 

Leave A Reply

Your Email Id will not be published!