Janasena Focus : ఎన్నిక‌ల‌పై జ‌న‌సేనాని ఫోక‌స్

శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై ఆరా

Janasena Focus : ఏపీలో ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీలు త‌మ అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నాయి. వైసీపీ ప‌దే ప‌దే చెప్పిన‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏర్పాటు చేసిన జన‌సేన(Janasena) గ‌త 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన అభ్య‌ర్థులు గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకు క‌లిగి ఉన్నారు. ఇదే విష‌యాన్ని జ‌న‌సేన(Janasena) ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకుంది. భీమ‌వ‌రంలో 62,285 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. గాజువాక‌లో 58539 ఓట్లు కైవ‌సం చేసుకుని రెండో స్థానంతో స‌రి పెట్టుకుంది. రాజోలులో 50053 ఓట్లు పొందింది. న‌ర్సాపురంలో 49,120 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది.

ఇక అమ‌లాపురంలో 45,200 , రాజ‌మండ్రి రూర‌ల్ లో 42,685 ఓట్లు, కాకినాడ రూర్ లో 39,247 , గ‌న్న‌వ‌రంలో 36,259 ఓట్లు పొందింది. తాడేప‌ల్లి గూడెంలో 36,197 ఓట్లు సాధించ‌గా కొత్త‌పేట‌లో 35,833 ఓట్లు, మండ‌పేట‌లో 35,173 ఓట్లు, ముమ్మ‌డివ‌రంలో 33,334 ఓట్లు , పాల‌కొల్లులో 32,984 ఓట్లు, త‌ణుకులో 31,961, కాకినాడ సిటీలో 30,188 ఓట్లు, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో 30,137 కోట్లు సాధించింది జ‌న‌సేన‌. తెనాలి లో 30,9095 ఓట్లు పొందింది. 30 వేల నుంచి 20 వేల ఓట్లు పొందిన నియోక‌వ‌ర్గాలు క‌నీసం 18 దాకా ఉంటాయ‌ని జ‌న‌సేన పార్టీ పేర్కొంది.

ప్ర‌తిపాడు , పెడ‌న‌, నిడ‌ద‌వోలు, రాజ‌నగ‌రం, గుంత‌క‌ల్, పిఠాపురం, పెద్దాపురం, రాజ‌మండ్రి సిటీ, భీమిలీ , వైజాగ్ నార్త్ , పెందుర్తి, య‌ల‌మంచ‌లి, అవ‌నిగ‌డ్డ‌, విజ‌యవాడ వెస్ట్ ,గుంటూర్ వెస్ట్, ఈస్ట్ ఉన్నాయి. 15 వేల నుండి 20 వేల లోపు వ‌చ్చిన ఓట్లు 20 దాకా ఉన్నాయ‌ని పేర్కొంది. 10 వేల నుండి 15 వేల లోపు వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గాలు 25 దాకా ఉన్నాయ‌ని తెలిపింది. 5 వేల నుంచి 10 వేల మ‌ధ్య వ‌చ్చిన ఓట్లు 30 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌డం విశేషం.

ఇక పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల ప‌రంగా చూస్తే వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేసిన జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు 2,88,87 ఓట్లు వ‌చ్చాయి. అమ‌లాపురం నుండి పోటీ చేసిన ఆర్ శేఖ‌ర్ కు 3,54,848, న‌ర్సాపురం నుంచి పోటీ చేసిన నాగ‌బాబుకు 2,50,289 ఓట్లు, రాజ‌మండ్రి నుంచి బ‌రిలో నిలిచిన ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌కు 1,55,807 , కాకినాడ నుంచి పోటీ చేసిన జ్యోతుల వెంక‌టేశ్వ‌ర్ రావుకు 1,32,648 ఓట్లు ఉన్నాయి. గుంటూరు నుంచి పోటీ చేసిన శ్రీ‌నివాస‌రావుకు 1,29,205 ఓట్లు, మ‌చిలీపట్నం అభ్య‌ర్థికి 1,13,292 ఓట్లు ప‌డ్డాయి.

మొత్తంగా అసెంబ్లీ సీట్ల ప‌రంగా చూస్తే దాదాపు జ‌న‌సేన 25 ల‌క్ష‌ల ఓట్లు సాధించింది. లోక్ స‌భ సెగ్మెంట్లు క‌లిపితే 20 ల‌క్ష‌లు దాకా ఉన్నాయి. సో ఈసారి ఆ ఓటు బ్యాంకు చెక్కు చెద‌ర‌కుండా మ‌రికొంత ప్ర‌య‌త్నం చేస్తే గెలుపు అవ‌కాశాలు ద‌క్కించు కోవ‌చ్చ‌ని జ‌న‌సేనాని ధీమాతో ఉన్నారు.

Also Read : Rahul Gandhi

Leave A Reply

Your Email Id will not be published!