Karimnagar Silver Filigree: అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్‌ ఫిలిగ్రీ ఉత్పత్తులు !

అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్‌ ఫిలిగ్రీ ఉత్పత్తులు !

Karimnagar Silver Filigree: దేశంలోనే అరుదైన కళల్లో కరీంనగర్‌ ఫిలిగ్రీ ఒకటి. వెండి తీగతో కళాకారులు ఆవిష్కరించే అద్భుతమైన ఉత్పత్తులు జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం సందర్భంగా ఫిలిగ్రీ మరోసారి చర్చనీయాంశమైంది. ముకేశ్‌ అంబానీ దంపతులు తన కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహానికి వచ్చేసే దేశ విదేశాలకు చెందిన అతిధితులకు ప్రముఖ చేనేత హస్తకళా రూపాలను బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు.

Karimnagar Silver Filigree…

ఈ క్రమంలో కరీంనగర్ కు చెందిన దాదాపు 400 ఫిలిగ్రీ వస్తువులకు ఆర్డర్‌ చేసినట్లు కరీంనగర్‌ ఫిలిగ్రీ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్‌కుమార్‌లు తెలిపారు. జులైలో ఈ పెళ్లి జరగనుంది. జ్యుయలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్‌ బౌల్స్, తదితర వస్తువులకు ఆర్డర్‌ ఇచ్చారు. గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు.

Also Read : Hemant Soren: హేమంత్‌ సోరెన్‌ పై సుప్రీం ఆగ్రహం !

Leave A Reply

Your Email Id will not be published!