Rama Krishna Reddy Pinnelli: పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ !

పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ !

Rama Krishna Reddy Pinnelli: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సంఘటన ఈనెల 13న జరిగితే… 15న ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేశారని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌ రెడ్డి తన వాదనలు వినిపించారు. ముందు ఎఫ్‌ఐఆర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని… తర్వాత లోకేష్ ట్విట్టర్‌ లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లి(Rama Krishna Reddy Pinnelli)కి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్‌రెడ్డి… సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు.

Rama Krishna Reddy Pinnelli Bail Updates

కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరిన ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోరారు. సింగిల్ బెంచ్‌లో న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి డివిజనల్ బెంచ్‌ లో న్యాయమూర్తి కావడంతో అక్కడ విచారణ ఉందని పిటిషన్‌ పై విచారణ కొద్దిసేపు వాయిదా వేశారు. ఇంకా పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది.

మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఈవీఎంలను పగలగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… ఈవీఎంలు పగలగొట్టిన దృశ్యాలు వెబ్ కాస్టింగ్ సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. దీనితో ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి పరారు కావడంతో… అతనికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పిన్నెల్లి తరపున లాయర్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.

Also Read : Karimnagar Silver Filigree: అంబానీ ఇంట పెళ్లికి కరీంనగర్‌ ఫిలిగ్రీ ఉత్పత్తులు !

Leave A Reply

Your Email Id will not be published!