Karnataka Farmers : కాంగ్రెస్ స‌ర్కార్ పై రైత‌న్న‌ల క‌న్నెర్ర‌

Karnataka Farmers : క‌ర్ణాట‌క – ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో కొలువు తీరింది కాంగ్రెస్ పార్టీ. వీటిని అమ‌లు చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఉచితంగా క‌రెంట్ ఇస్తామ‌న్నారు. నిరంత‌రం విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. తీరా చూస్తే క‌రెంట్ కోత‌లు విధిస్తుండ‌డంతో సాధార‌ణ వినియోగ‌దారుల‌తో పాటు రైతులు సైతం రోడ్డెక్కారు. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు కొన‌సాగిస్తున్నారు.

Karnataka Farmers Power Issue

ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత చేతులు కాల్చు కోవ‌డం ప‌రిపాటిగా మారింది పాల‌కుల‌కు. ఇప్ప‌టికే ప‌వ‌ర్ షేరింగ్ కోసం పంచాయ‌తీ కొన‌సాగుతోంది. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించాల్సిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం అత్యంత బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రించ‌డంపై రైతు సంఘాలు, అన్న‌దాత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌ర్ణాట‌క రాష్ట్ర(Karnataka) వ్యాప్తంగా క‌నీసం 5 గంట‌లు కూడా ఇవ్వ‌డం లేదంటూ రైతులు మండిప‌డ్డారు. దీని వ‌ల్ల సాగు చేసుకున్న పంట‌లు చేతికి రావ‌డం లేద‌ని, వేలాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి పండిస్తే ప‌వ‌ర్ క‌ట్ కార‌ణంగా పంట‌లు కోల్పోవాల్సి వస్తోంద‌ని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో బెంగ‌ళూరులో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ కు సైతం ప‌వ‌ర్ క‌ట్ కార‌ణంగా అంత‌రాయం ఏర్ప‌డింది.

Also Read : Rahul Gandhi : ప్ర‌జ‌లే దేవుళ్లు దేశ‌మే నా ఇల్లు

Leave A Reply

Your Email Id will not be published!