Free Bus Travel : కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం
జూన్ 1 నుంచి అమలు..నో కండీషన్స్
Free Bus Travel : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలోని మహిళందరికీ శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి ప్రతి ఒక్కరికీ ఉచితంగా కర్ణాటక రోడ్డు రవాణా సంస్థలో ప్రయాణం(Free Bus Travel) చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు.
ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎలాంటి షరతులు అనేవి విధించ లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా సంస్థకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా బస్సుల్లో ఎక్కవచ్చని, ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు నెలకు పెన్షన్, మహిళలకు ఆసరా, ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు, ఉచితంగా పేదలకు రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది పార్టీ.
మేని ఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 5 హామీలను ప్రకటించింది. వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అమలు చేస్తామని సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. ఆ మేరకు తొలి మంత్రివర్గంలోనే ఇందుకు సంబంధించి తీర్మానం చేశారు. మొత్తంగా కర్ణాటక సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో పెను సంచలనం రేపింది.
Also Read : Owaisi KCR