Karnataka HC Fine : ట్విట్టర్ కు రూ. 50 లక్షల జరిమానా
కేసు కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
Karnataka HC Fine : మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్రానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసును కొట్టి వేసింది. అంతే కాదు రూ.50,00,000 జరిమానా విధించింది. దీనిపై ట్విట్టర్ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం. కేంద్రం జారీ చేసిన ఆర్డర్ ను సవాల్ చేస్తూ ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులు ఏక పక్షంగా , భారత రాజ్యాంగంలో పొందు పర్చిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగగించేలా ఉన్నాయంటూ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది.
ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి సుదర్ఘ కాలం పాటు వాదోప వాదనలు జరిగాయి. కొన్ని ట్వీట్లు , ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ట్విట్టర్ ను. ఇందుకు ససేమిరా ఒప్పుకోలేదు మైక్రో బ్లాగింగ్ సంస్థ. ట్విట్టర్ అభ్యర్థనను పట్టించు కోలేదు హైకోర్టు(Karnataka HC). ఆ మేరకు ట్విట్టర్ సంస్థ ప్రవర్తన దారుణంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.
ఇదిలా ఉండగా ట్విట్టర్ మాజీ సీఇవో జాక్ డోర్సీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో మోదీ ప్రభుత్వం వివక్షా పూరితంగా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. ఆయన విమర్శలు చేసి ఆరు వారాలు అవుతోంది. ఇదిలా ఉండగా ట్విట్టర్ కు నోటీసులు జారీ చేశామని , కానీ ఎలాంటి స్పందన అటు వైపు నుంచి రాలేదంటూ ఐటీ సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపారు.
Also Read : DK Shiva Kumar : ప్రజా సమస్యలపై ఫోకస్ – డీకే