PSI Exam Scam : ఎస్సై భ‌ర్తీ స్కాం బీజేపీ నేత దివ్య నిర్వాకం

ఒక్కో అభ్య‌ర్థి నుంచి రూ. 25 ల‌క్ష‌లు వ‌సూలు

PSI Exam Scam : క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతి అక్ర‌మాల‌కు అడ్డాగా మారి పోయింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) నియామ‌కాల‌కు (PSI Exam Scam) సంబంధించిన భారీ స్కాం వెలుగు చూసింది.

ఇది దేశాన్ని ఒక ఊపు ఊపింది. మ‌రో వైపు ఇంత జ‌రుగుతున్నా బీజేపీ హై క‌మాండ్ కిమ్మ‌న‌డం లేదు. మేరా భార‌త్ మహాన్ అంటూ చిలుక ప‌లుకులు ప‌లుకుతోంది.

కులం, మ‌తం, ప్రాంతం పేరుతో హ‌ల్ చ‌ల్ చేసే బీజేపీ ఎందుకు ఈ విష‌యంపై మౌనంగా ఉందో చెప్ప‌డం లేదు. తాజాగా ఎస్సై నియామ‌కాల్లో చోటు చేసుకున్న వ్య‌వ‌హారంలో బీజేపికి చెంది నాయ‌కురాలు దివ్య హ‌గ‌రాగి వెలుగులోకి వ‌చ్చింది.

ఆమె ఒక్కో అభ్య‌ర్థి నుంచి రూ. 25 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్లు తేల్చింది. స్కూల్ సిబ్బందితో ఓఎంఆర్ ష‌ట్స్ నింపించింద‌ని విచార‌ణ సంస్థ సీఐడీ స్ప‌ష్టం చేసింది.

ఈమేర‌కు చార్జ్ షీట్ దాఖ‌లుచేసింది. ఈ స్కాంకు సంబంధించి దివ్య‌ను అరెస్ట్ చేసి విచారించారు. స్కూల్ సిబ్బందికి రూ. 4 వేలు ఇచ్చిన‌ట్లు ఒప్పుకుంది.

గ‌త ఏడాది 2021 అక్టోబ‌ర్ 3న జ‌రిగిన ఎస్సై ప‌రీక్ష‌లో ఈ అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయి. ఈ నిర్వ‌హించే స్కూల్ లో సెంట‌ర్ ప‌డ‌డంతో ఈ నిర్వాకానికి తెర లేపింది ఈ అమ్మ‌డు.

ఎస్ఐ భారీ స్కాంకు (PSI Exam Scam) సంబంధించి బీజేపీ నోరు విప్ప‌డం లేదు. దివ్య హ‌గ‌రాగి ఒక్కో అభ్య‌ర్థి నుంచి ప‌రీక్ష రాసేందుకు రూ. 30 ల‌క్ష‌లు డిమాండ్ చేసింది. చివ‌ర‌కు బేరం కుద‌ర‌క పోవ‌డంతో విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.

Also Read : ‘దీదీ..మోదీ’ ఇద్ద‌రూ ఒక్క‌టే – అధీర్

Leave A Reply

Your Email Id will not be published!