Katey Martin : ఇక క్రికెట్ కు సెలవు – కేటీ మార్టిన్
ఆటకు రిటైర్మెంట్ ప్రకటన
Katey Martin : ప్రపంచ మహిళా క్రికెట్ లో టాప్ ప్లేయర్ గా పేరొందారు న్యూజిలాండ్ కు చెందిన కేటీ మార్టిన్. మోస్ట్ వాంటెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేశారు.
ఇక తాను ఆడలేనంటూ, ఆట నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించి. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ ల నుంచి తాను నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించారు. సుదీర్గమైన ఆటను ఆస్వాదించారు ఆమె.
న్యూజిలాండ్ దేశం తరపున అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. 2003లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టారు కేటీ మార్టిన్. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా రాణించారు.
తన దేశానికి సేవలు అందించారు. న్యూజిలాండ్ కు చిరస్మరణీయమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు కేటీ మార్టిన్(Katey Martin). తన క్రికెట్ జీవిత కాలంలో ఏకంగా 19 ఏళ్ల పాటు ఆడారు. ఒక రకంగా ఆ దేశ చరిత్రలోనే ఓ రికార్డుగా చెప్పవచ్చు.
తన కెరీర్ లో మొత్తం 103 వన్డే మ్యాచ్ లు ఆడింది కేటీ మార్టిన్. 95 టీ20 మ్యాచ్ లతో పాటు ఒక టెస్టు ఆడింది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా వన్డే వరల్డ్ కప్ -2022లో ఆమె తన జట్టు తరపున ఆడారు
. గత మార్చి నెలలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ కేటీ మార్టిన్(Katey Martin) కు చివరది కావడం విశేషం. అన్ని ఫార్మాట్ లు కలిపి 2, 900 రన్స్ చేసింది. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 81 రన్స్. ఇక దేశీవాళిలో 169 మ్యాచ్ లు ఆడింది.
ఇది ఆమె పేరు మీదే రికార్డు నమోదై ఉంది. ఇన్నేళ్లు దేశం కోసం ఆడాను. నాకు సహకరించిన, ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు కేటీ మార్టిన్.
Also Read : కోచ్ సంగక్కర సపోర్ట్ మరిచి పోలేను