Katherine Brunt : టెస్ట్ క్రికెట్ కు కేథ‌రిన్ బ్రంట్ గుడ్ బై

ప్ర‌క‌టించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు

Katherine Brunt : ఇంగ్లండ్ స్టార్ మహిళా క్రికెట‌ర్ కేథ‌రిన్ బ్రంట్ ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుంది. తాను టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆమె నిర్ణ‌యాన్ని ధ్రువీక‌రించింది.

ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఇక నుంచి వ‌న్డేలు, టి20 మ్యాచ్ ల‌లో మాత్ర‌మే కొన‌సాగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది కేథ‌రిన్ బ్రంట్(Katherine Brunt). ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట్ చ‌రిత్ర‌లో కేథ‌రిన్ అత్య‌థిక వికెట్లు తీసిన మూడో బౌల‌ర్ గా చ‌రిత్ర సృష్టించింది.

2004లో యాషెస్ సీరీస్ సంద‌ర్భంగా త‌న కెరీర్ స్టార్ట్ చేసింది. వ‌చ్చీ రావ‌డంతోనే ఏకంగా 9 వికెట్లు తీసింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఆపై 52 కీల‌క ప‌రుగులు చేసి ఇంగ్లండ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది.

ఆనాటి నుంచి నేటి దాకా ఇంగ్లండ్ జ‌ట్టుకు ఎన‌లేని సేవ‌లు అందించింది. క్రికెట్ లో ముద్దు పేరు బ్రంటి, స‌న్నీ. చివ‌రి టెస్టు 27 జ‌న‌వ‌రి 2022 ఆస్ట్రేలియాతో ఆడింది.

వ‌న్డే మ్యాచ్ ను 13 మార్చి 2005లో ద‌క్షిణాఫ్రికాతో ప్రారంభించింది కేథ‌రిన్ బ్రంట్. ఇక టి20 మ్యాచ్ ను 2 సెప్టెంబ‌ర్ 2005లో ఆస్ట్రేలియాతో ఆరంభించింది బ్రంట్. దేశీవాలి కౌంటీల‌లో ఆడుతోంది.

2004లో యార్క్ షైర్ త‌ర‌పున‌, 2015 నుంచి 2018 వ‌ర‌కు పెర్త్ స్కార్చ‌ర్స్ , 2016 నుంచి 2019 దాకా యార్క్ షైర్ కు ఆడింది. 2020 నుంచి 2021 వ‌ర‌కు మెల్ బోర్న్ స్టార్స్ త‌ర‌పున ఆడింది బ్రంట్(Katherine Brunt).

ఇక కేథ‌రిన్ బ్రంట్ 2 జూలై 1985లో పుట్టారు. కుడి చేతి ఫాస్ట్ బౌల‌ర్, బ్యాట‌ర్ కూడా. ఇంగ్లండ్ జ‌ట్టు త‌ర‌పున రెండు ప్ర‌పంచ క‌ప్ లు ఆడింది. నాలుగు సార్లు ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా ఎంపికైంది.

Also Read : కార్తీక్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆడాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!