Kavya Maran Marriage Proposal : ‘కావ్యా’ ప్లీజ్ పెళ్లి చేసుకోవా

స‌న్ రైజ‌ర్స్ సిఇఓకు ఆఫ‌ర్

Kavya Maran Marriage Proposal : భార‌తీయ క్రికెట్ లో ప్ర‌ధానంగా ఐపీఎల్ లో మోస్ట్ పాపుల‌ర్ పేరు ఎవ‌రైనా ఉన్నారంటే ఒకే ఒక్క‌రు. ఆమె ఎవ‌రో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ మిస్టిరీయ‌స్ గ‌ర్ల్ గా పేరొందారు.

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తూ వ‌స్తున్నారు. ఆసియా ఖండంలోనే టాప్ మీడియా మొఘ‌ల్ గా పేరొందిన త‌మిళ‌నాడుకు చెందిన స‌న్ నెట్ వ‌ర్క్ కు చెందిన కావ్య మార‌న్. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు యాజ‌మాన్యానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు.

అత్యంత అంద‌మైన యువ‌తుల్లో ఒక‌రిగా గుర్తింపు పొందారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆమె స్టేడియంలోని గ్యాల‌రీలోకి వ‌చ్చిందంటే చాలు కోట్లాది క‌ళ్లన్నీ కావ్య మారన్ వైపు చూస్తాయి. అంతే కాదు వంద‌ల కెమెరాలు, ల‌క్ష‌లాది మొబైల్స్ క్లిక్ కొడ‌తాయి. ఈ అమ్మ‌డికి భార‌త దేశంలోనే కాదు యావ‌త్ ప్ర‌పంచంలో చాలా చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు.

ఆమె అందానికి ఫిదా కాని వాళ్లు లేరంటే అతిశ యోక్తి కాదు. తాజాగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. అదేమిటంటే ద‌క్షిణాఫ్రికాలో సౌతాఫ్రికా 20 లీగ్ మ్యాచ్ సంద‌ర్భంగా త‌న‌ను మ్యారేజ్ (పెళ్లి ) చేసుకోవా అంటూ ఓ అభిమాని కూర్చుని, ప్ల కార్డు ప‌ట్టుకుని(Kavya Maran Marriage Proposal) అభ్య‌ర్థించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

పార్ల్ లోని బోలాండ్ పార్క్ మైదానంలో రాయ‌ల్స్ తో ఆమె జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్ జ‌రుగుతున్న స‌మ‌యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ ఫ్యాన్ నుండి ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఫోటోలు, వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే ఫ్యాన్ ప్ర‌పోజల్ ను లైట్ గా తీసుకుంది కావ్య మార‌న్.

Also Read : రెండో వ‌న్డేలో కీల‌క మార్పులు

Leave A Reply

Your Email Id will not be published!