Kavya Maran Brook : మెరిసిన బ్రూక్ మురిసిన కావ్య
ఐపీఎల్ లో తొలి సెంచరీ చేసిన హ్యారీ
Kavya Maran Brook : ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ కీలక లీగ్ మ్యాచ్ లో పరుగుల వరద పారించారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. ప్రధానంగా ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్(Brook) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోల్ కతా స్కిప్పర్ నితీశ్ రాణా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓ వైపు రెండు వికెట్లు త్వరగా కోల్పోయినా ఎక్కడా తగ్గలేదు. హ్యారీ బ్రూక్ తన కెప్టెన్ మార్క్రామ్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
55 బంతులు ఎదుర్కొన్న హ్యారీ బ్రూక్ 12 ఫోర్లు 3 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో సెంచరీ చేసిన తొలి ఆటగాడు బ్రూక్ కావడం విశేషం. ఇక 2 ఫోర్లు 5 సిక్సర్లతో మార్క్రామ్ రెచ్చి పోయాడు. 50 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఏరికోరి హ్యారీ బ్రూక్ ను ఎంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ సిఇఓ కావ్య మారన్.
ఇవాళ జరిగిన కీలక పోరులో సత్తా చాటడంతో పాప పెదవులపై నవ్వు పూసింది. ఇక హైదరాబాద్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే భారీ స్కోర్ చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుతం కావ్య మారన్(Kavya Maran Brook) మరోసారి నెట్టింట్లో వైరల్ గా మారారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు సిఇఓ.
Also Read : వారెవ్వా రింకూ సింగ్ అదుర్స్