Kavya Maran Viral : కావ్య మారన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
ఐపీఎల్ వేలం పాటలో ముద్దుగుమ్మ
Kavya Maran Viral : మీడియా మొఘల్ గా పేరొందిన దయానిధి మారన్ ముద్దుల కూతురు కావ్య మారన్(Kavya Maran) మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారనున్నారు. వచ్చే ఏడాది 2023లో జరగనున్న మెగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాటకు సమయం వచ్చేసింది. ఇంకొద్ది గంటల్లో మినీ వేలం పాట (ఆక్షన్) జరగనుంది.
గత ఏడాది ఐపీఎల్ వేలం పాట బెంగళూరులో నిర్వహించింది బీసీసీఐ. ఈసారి ప్లేస్ మార్చింది. కేరళలోని కొచ్చి నగరాన్ని ఎంపిక చేసింది. డిసెంబర్ 23 శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం పాట ప్రారంభం అవుతుంది. 925 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకుంటే ఐపీఎల్ లో ఆడేందుకు కేవలం 405 ప్లేయర్లకే ఛాన్స్ ఇచ్చింది ఐపీఎల్ ప్యానల్.
ఇక మొత్తం 10 ఫ్రాంచైజీలకు సంబంధించిన యజమానులు పాల్గొంటారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎప్పుడైతే సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ను సన్ ఇంటర్నేషనల్ చేజిక్కించుకుందో ఆనాటి నుంచి ఆ సంస్థకు సిఇఓగా ఉన్న కావ్య మారన్(Kavya Maran) హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఆమె ఓనర్ గా కంటే అందంలో టాప్ లో ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
ఆమె ప్రతి కదలికను కెమెరాలు క్లిక్కు మనిపిస్తున్నాయి. ప్రతి సన్నివేశాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో క్షణాల్లో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈసారి కూడా కావ్య మారన్ మరోసారి సెంటర్ పాయింట్ కానున్నారు. ఇక మొత్తం వేలం పాటలో అత్యధిక డబ్బులు కూడా కావ్య వద్దనే ఉండడం విశేషం.
ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా తన జట్టు ఆశించిన స్థాయిలో ఆడక పోవడం విస్తు పోయేలా చేస్తోంది.
Also Read : కేఎల్ రాహుల్ కు గాయం ఆడేది కష్టం