Kavya Maran : దుబాయ్ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో తీవ్ర నిరాశ పరిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. కోట్లాది రూపాయలు వెచ్చించినా ఎందుకని ఆటగాళ్లు ఆడలేక పోతున్నారంటూ వాపోయింది ఆ జట్టు మేనేజ్ మెంట్.
ఈ జట్టుకు ఇప్పుడు సిఇఓగా కావ్య మారన్(Kavya Maran) ఉన్నారు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో ఆ జట్టును స్వంతం చేసుకుంది సన్ గ్రూప్. కానీ సీన్ మారింది. 2022లో ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో దుమ్ము రేపుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్.
ఆ జట్టుకు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కు పగ్గాలు అప్పగించింది. మొదటి మూడు మ్యాచ్ లు ఓడి పోయింది. అంతా హైదరాబాద్ కు ఏమైందంటూ నిలదీశారు.
ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు. అటు బౌలింగ్ లో , బ్యాటింగ్ లోనూ సత్తా చాటారు. మొదటి మూడు మ్యాచ్ లలో చేతులెత్తేసినా ఆ తర్వాత దెబ్బ తిన్న పులుల్లా రెచ్చి పోయారు.
ప్రత్యర్థుల గుండెల్లో గునపాలు దించుతున్నారు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చుక్కలు చూపించింది సన్ రైజర్స్ హైదరాబాద్. కేవలం 68 పరుగులకే కట్టడి చేసింది.
మార్కో జాన్సెన్ , టి. నటరాజన్ అద్భుతమైన బౌలింగ్ తో మెస్మరైజ్ చేశారు. వరుసగా ఐదు మ్యాచ్ లలో ఘన విజయాలను సాధించడంతో సిఇఓ కావ్య మారన్ పెదవుల మీద నవ్వు పూసింది.
కెమెరాలన్నీ ఆమెపై ఫోకస్ పెట్టాయి. కావ్య ఐపీఎల్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
Also Read : గుజరాత్ జైత్రయాత్ర కోల్ కతా ఓటమి