KCR The Boss Comment : బాస్ ఫిక్స్ బీఆర్ఎస్ జోష్
తెలంగాణలో ఎన్నికల నగారా
KCR The Boss Comment : కేసీఆర్ ఉద్యమ నాయకుడే కాదు దమ్మున్న లీడర్. రాజకీయాలు అందరూ చేస్తారు. కానీ కొందరే వాటిని తమకు అనుకూలంగా మల్చుకుంటారు. దానిని చదరంగం లాగా నిత్యం ఆడుతూ ఉంటారు. అలాంటి వారిలో ముందంజలో ఉంటారు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్. ఆయన అంతరంగంలో ఏముందో ఎవరూ చెప్పలేరు. ఎవరూ అంచనా వేయలేరు. ఒకానొక సమయంలో తన తనయుడు, కూతురు, అల్లుడికి కూడా ఆయన అర్థం కారు.
ప్రత్యర్థులను అంచనా వేయడంలో, వాళ్ల కాళ్లకు బంధనాలు వేయడంలో, వాళ్లు కోలుకోలేని రీతిలో షాక్ కు గురి చేయడంలో కేసీఆర్(KCR) సిద్దహస్తుడు. ఆయన తర్వాతే ఏ నాయకుడైనా. రాజకీయాలను కేవలం ఎన్నికల కోసమేనని భావించే పార్టీలు, నేతలు ఉన్న ఈ రాష్ట్రంలో కేసీఆర్ అది తప్పని దానిని ఓ ఛాలెంజ్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు. చేసి చూపించారు కూడా. ఆయన పదే పదే చెప్పేది ఒకటే..ప్రతిపక్షాలకు పాలిటిక్స్ ఓ వ్యాపారం. తమపై దుమ్మెత్తి పోయడం తప్పితే ఇంకేమీ చేత కాదు. కానీ తమ పార్టీకి ముఖ్యంగా తనకు ప్రతి రోజూ ఓ సవాల్ తో కూడుకుని ఉన్నదని ప్రకటించారు.
KCR The Boss Comment Viral
తను ఒకటి అనుకున్నాడంటే ఇక ఆరు నూరైనా సరే చేసి చూపించాల్సిందే. అందుకే కేసీఆర్ సక్సెస్ ఫుల్ నాయకుడు అయ్యాడు. మరికొందరు నేతలు మరుగుజ్జులుగా ఉండి పోయారు. ఇందుకు కారణం విజన్ లేక పోవడం. తనను తక్కువ అంచనా వేసిన గొప్ప విజినరీ ఉందని భ్రమపడే టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపించాడు కేసీఆర్(KCR). తనతో పెట్టుకుంటే బాగుండదని తేల్చి చెప్పాడు. అవసరమైతే సంధి కుదుర్చు కోవడంలో, స్నేహం చేయడంలో కేసీఆర్ ముందుంటాడు. అదే సమయంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో కూడా సిద్దహస్తుడు. అందుకే ఆయనలోని మర్మాన్ని కనుగొనేందుకు ఎందరో ప్రయత్నం చేశారు. మరికొందరు దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆకళింపు చేసుకోలేక పోయారు. చతికిల పడ్డారు. రాజకీయాల్లో నామ రూపాలు లేకుండా పోయారు. మరికొందరు తమ ఉనికి కోసం , గుర్తింపు కోసం నానా తంటాలు పడుతున్నారు.
తాజాగా మరోసారి కేసీఆర్ హాట్ టాపిక్ గా మారారు. కారణం ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు. 119 సీట్లకు గాను 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఏడుగురు సిట్టింగ్ లకు స్థాన చలనం కల్పించారు. పార్టీ గీత దాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా అనుకున్నట్టుగానే ఆయన ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు జాబితా ప్రకటించడంతోనే ఇక ఎన్నికలకు సిద్దం కావాలని డిసైడ్ చేశారు కేసీఆర్. దీంతో రాష్ట్ర మంతటా బీఆర్ఎస్ లో సంబురాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ ను ఢీకొనాలంటే దమ్ముండాలి. మరి ప్రతిపక్షాలు ఆ మేరకు ప్రయత్నం చేస్తాయా అన్నది వేచి చూడాలి. మొత్తంగా బాస్ ఫిక్స్ అయ్యాడంటే ఓటు బాక్సులు బద్దలు కావాల్సిందే కదూ.
Also Read : KTR Harish Rao : బావకు మద్దతు తెలిపిన బామ్మర్ది
