KCR Tour : పండ‌రీపురానికి కేసీఆర్ ప‌య‌నం

600 వాహ‌నాల‌తో కాన్వాయ్

KCR Tour : భార‌త రాష్ట్ర స‌మితి చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ప‌టిష్ట స్థితిలో ఉన్న బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ప్ర‌స్తుతం మ‌రాఠాపై దృష్టి సారించారు. అక్క‌డ రాబోయే ఎన్నిక‌ల బ‌రిలో బీఆర్ఎస్ నిల‌బ‌డేలా చేస్తున్నారు. ఇప్ప‌టికే స‌భ‌లు, స‌మావేశాల‌తో హోరెత్తించారు. అంతే కాకుండా ప‌లు ప‌ట్ట‌ణాల‌లో బీఆర్ఎస్ ఆఫీసుల‌ను కూడా ప్రారంభించారు. ఎలాగైనా స‌రే బీఆర్ఎస్ జెండాను ఎగుర వేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ (KCR)భారీ కాన్వాయ్ తో మ‌హారాష్ట్ర లోని షిర్దీ సాయినాథుడు కొలువు తీరిన పండ‌రీపురానికి బ‌య‌లు దేరారు. ఆయ‌న తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ 11 ల‌క్ష‌ల మందిని క‌లిగి ఉంది. దానిని 30 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు సీఎం కేసీఆర్. రెండు రోజుల పాటు మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించేందుకు బ‌య‌లు దేరారు. ఇందులో భాగంగా విఠ‌లేశ్వ‌రుడు, తుల్జా భ‌వానీని ద‌ర్శించు కోనున్నారు.

ఇదే స‌మ‌యంలో మ‌రాఠాలోని భివాండీ నేత‌లు, ఎన్సీపీ , కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, అనుచ‌రులు భారీగా చేర‌నున్నారు. టూర్ లో భాగంగా ఒమ‌ర్గాలో భోజ‌నం చేస్తారు. సోలాపూర్ లో బ‌స చేస్తారు. అక్క‌డి నుంచి పండ‌రీపురంకు చేరుకున్నారు. మంగ‌ళ‌వారం తుల్జా భ‌వానీ అమ్మ వారిని ద‌ర్శించుకుంటారు.

Also Read : Raithu Bandhu Release : రైతుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

 

Leave A Reply

Your Email Id will not be published!