ICC Player Of The Month : ‘కీగన్ ..నైట్’ ప్లేయర్ ఆఫ్ ది మంత్
ప్రకటించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
ICC Player Of The Month : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ ఏడాది జనవరి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్(ICC Player Of The Month) అవార్డును ప్రకటించింది. పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కీగన్ పీటర్సన్ అవార్డుకు ఎంపిక కాగా మహిళల విభాగంలో హీథర్ నైట్ ను వరించింది.
స్వదేశంలో భారత్ తో జరిగిన టెస్టు సీరస్ లో కీగన్ పీటర్సన్ దుమ్ము రేపాడు. అద్భుతంగా ఆడాడు..
పరుగులు చేస్తూ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అంతకు ముందు దక్షిణాఫ్రికా అండర్ -19 స్టార్ డెవాల్ట్ బ్రెవిస్,
బంగ్లాదేశ్ పేసర్ ఎబాడోట్ హుస్సేన్ లతో పాటు నామినేట్ అయిన పీటర్సన్ ఇండియాతో టెస్ట్ సీరీస్ తర్వాత పీఓటీఎం అవార్డు పొందాడు.
భారత్ తో జరిగిన సీరీస్ లో రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేశాడు.
ఆ తర్వాత టార్గెట్ ఛేదనంలో కీలకంగా ఆడాడు. చివరి టెస్టులో ప్రతి ఇన్నింగ్స్ లో 50 పరుగులు చేశాడు.
నాల్గో ఇన్నింగ్స్ లో ఏకంగా 82 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకంగా మారాడు.
మూడు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో కీగన్ పీటర్సన్ 276 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా టాప్ లో నిలిచాడు.
దీంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా ఎంపికయ్యాడు. ఇక మహిళల విభాగంలో
ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా(ICC Player Of The Month) ఎన్నికయ్యారు హీథర్ నైట్ . మహిళల టెస్టు చరిత్రలో ఆమె 168 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
ఇది ఓ రికార్డు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఇంగ్లండ్ కెప్టెన్ నైట్ తో పాటు శ్రీలంక మహిళా జట్టు స్కిప్పర్ చమరి అతపత్తు, విండీస్ స్టార్ డియాండ్రా పోటీ పడ్డారు. చివరకు నైట్ నిలిచింది.
Also Read : స్టార్ ప్లేయర్లతో గుజరాత్ టైటాన్స్