R Hari Kumar : చైనా నౌకలపై కన్నేసి ఉంచాం – నేవీ చీఫ్
హిందూ మహా సముద్రంలో నౌకల హల్ చల్
R Hari Kumar : భారత నేవీ చీఫ్ అడ్మిరల్ చీఫ్ ఆర్ హరి కుమార్ సంచలన ప్రకటన చేశారు. హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన నౌకలు ఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నంచేశారు. ఆయా నౌకల కదలికలను నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు. 24 గంటల పాటు నిఘాను ముమ్మరం చేశామని వెల్లడించారు.
హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో దాదాపు 60 బేసి, ఇతర అదనపు ప్రాంతీయ బలగాలు గస్తీ తిరుతున్నాయని పేర్కొన్నారు నేవీ చీఫ్. చైనా నౌకా దళానికి చెందిన నౌకల కదలికలతో పాటు ఆ ప్రాంతంలో జరిగే అన్ని పరిణామాలను భారత నావికాదళం నిశితంగా గమనిస్తుందన్నారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్.
ఇదిలా ఉండగా హిందూ మహాసముద్రం ప్రాంతంలో చాలా నౌకలు చైనాకు చెందినవి పని చేస్తున్నాయని తెలిపారు. చైనీస్ షిపింగ్ ఓడలు తిరుగుతున్నాయని ఒప్పుకున్నారు. ఇది చాలా దేశాలకు అత్యంత ముఖ్యమైన ప్రాంతమని తెలుసన్నారు. ఇక్కడ పెద్ద మొత్తంలో రవాణా, శక్తి ప్రవాహాలు జరుగుతాయని చెప్పారు.
సముద్ర డొమైన్ లో భారత దేశ ప్రయోజనాలను కాపాడడం తమ కర్తవ్యమని స్పష్టం చేశారు నేవీ చీఫ్ ఆర్. హరికుమార్(R Hari Kumar). మరో వైపు హిందూ మహా సముద్రం ప్రాంతంలో చైనా గూడచారి విభాగానికి చెందిన నౌకలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయా నౌకల కదలికల తీరుపై భారత బలగాలు నిఘా ఉంచినట్లు సమాచారం.
ఇదే సమయంలో జాతీయ ప్రయోజనాలను రక్షించేందుకు, సంరక్షించేందుకు , ప్రోత్సహించేందుకు నౌకాదళం సిద్దంగా ఉందని ప్రకటించారు నేవీ చీఫ్.
Also Read : ఎక్కడికి వెళ్లినా ఇండియా నాతోనే ఉంటుంది