Kejriwal Car Attack : కేజ్రీవాల్ కార్ పై దాడి ఘటనలో ఆప్ అభియోగాలను తిప్పికొట్టిన బీజేపీ
ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది...
Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఇటుకలు, రాళ్లతో దాడి జరిగింది. శనివారంనాడు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ ‘గూండాలే’ ఈ దాడికి పాల్పడినట్టు ఆప్(AAP) ఒక ట్వీట్‌లో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
Kejriwal Car Attacked…
”ఓటమి భయంతో బీజేపీ అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి గూండాలను ఉసిగొల్పింది. ఎన్నికల ప్రచారంలో ఉండగా కేజ్రీవాల్‌ను గాయపరిచి ప్రచారం నుంచి దూరంగా ఉండేలా చేసేందుకు బీజేపీ అభ్యర్థి పర్వేష్ గూండాలు ఇటుకలు, రాళ్లు ఆయనపై విసిరారు. బీజేపీ పిరికిపంద దాడులకు కేజ్రీవాల్ భయపడే ప్రసక్తేలేదు. ఢిల్లీ ప్రజలు మీకు (బీజేపీ) గట్టి గుణపాఠం చెబుతారు” అని ఆ పోస్ట్‌లో ఆప్ పేర్కొంది.
‘ఆప్’ చేసిన ఆరోపణలను పర్వేష్ వర్మ తిప్పికొట్టారు. అరవింద్ కేజ్రీవాల్ వాహనం ఇద్దరు యువకులను ఢీకొట్టిందని ఆయన తెలిపారు.కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు వచ్చినప్పుడు కారుతో ఆ యువకులను ఢీకొట్టారని, ఆ ఇద్దర్నీ లేడీ హార్డింగ్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఓటమి తప్పదని గ్రహించిన కేజ్రీవాల్ ప్రజల ప్రాణాలను కూడా లెక్కచేడయం లేదని ఆరోపించారు. గాయపడిన యువకులను పరామర్శించేందుకు ఆసుత్రికి వెళ్తున్నట్టు పర్వేష్ వర్మ ఒక ‘ట్వీట్’ లో తెలిపారు.
Also Read : CM Siddaramaiah-Muda : సీఎం సిద్దరామయ్య కు ఈడి షాక్..300 కోట్ల విలువైన ఆస్తులు సీజ్