Kerala CM Pinarayi : ట్రిపుల్ తలాక్ పై పినరయి కామెంట్స్
దానిని నేరంగా ఎందుకు పరిగణించాలి
Kerala CM Pinarayi : కేరళ సీఎం పినరయి విజయన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్రిపుల్ తలాక్ ను(Triple Talaq) ఎందుకు నేరంగా పరిగణించాలని ప్రశ్నించారు. కేరళలో పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ)ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమంటూ ప్రకటించారు సీఎం. విడాకుల విషయంలో ఒక దేశం వేర్వేరు శిక్షా ప్రమాణాలను కలిగి ఉండ గలదా అని విజయన్ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అన్ని మతాలలో విడాకులు జరిగినప్పుడు ముస్లింలలో తక్షణ విడాకులు తీసుకునే పద్దతిని ఎందుకు నేరంగా పరిగణిస్తారంటూ నిలదీశారు పినయర్ విజయన్(Kerala CM Pinarayi).
ఇది కేవలం ముస్లింలకు మాత్రమే ఎందుకన్నారు. ఇతర విడాకుల కేసులన్నీ కోర్టులలో సివిల్ కేసుగా పరిగణించ బడతాయన్నారు. కేరళలోని కాసర్ గోడ్ లో అధికార సీపీఎం మార్చ్ జనకీయ ప్రతిరోధ్ జాధాను ప్రారంభించారు సీఎం. పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్ నుండి మైనార్టీ హిందువులు , సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలకు పౌరసత్వం మంజూరు చేసేందుకు కేంద్రం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం చట్టాన్ని కేరళలో అమలు చేయబోమంటూ మరోసారి స్పష్టం చేశారు కేరళ సీఎం(Kerala CM Pinarayi).
పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వాన్ని నిర్ణయించేందుకు కేంద్రం మతాన్ని ఉపయోగించిందన్నారు. అయితే మా పంథా గురించి ఇప్పటికే కేంద్రానికి తెలియ చేశామని స్పష్టం చేశారు పినయర్ విజయన్. జామాత్ ఇ ఇస్లామీ ఆర్ఎస్ఎస్ తో ఎవరి కోసం చర్చలు జరిపిందని నిలదీశారు కేరళ సీఎం. మ్యాట్రిమోనియల్ విడాకుల విషయంలో ఒక దేశం ప్రత్యేక శిక్షా ప్రమాణాలను కలిగి ఉండగలదా అని ప్రశ్నించారు.
Also Read : పంజాబ్ కు నిధులు నిలిపి వేత