Kerala CM : పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయం – సీఎం
కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటన
Kerala CM : కేరళ సీఎం పినరయి విజయన్(Kerala CM) సంచలన ప్రకటన చేశారు. ఆయన పౌరసత్వ చట్టం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని చెప్పారు.
మతం ఆధారంగా పౌరసత్వం నిర్ణయించబడదని కేరళ ప్రభుత్వం నమ్ముతుందన్నారు. అందుకే అమలు చేయకూడదని నిర్ణయం తీసుకుందని చెప్పారు పినరయి విజయన్.
ప్రస్తుతం లౌకిక వాదాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు సీఎం.
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సిఎఎ) తమ ప్రభుత్వం అమలు చేయబోదని తేల్చి చెప్పారు విజయన్. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ వేడుకలను నిర్వహించింది.
ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సీఎం పినరయి విజయన్(Kerala CM) సంచలన ప్రకటన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై తమ ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉందన్నారు.
అదే చివరి దాకా కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం. భారత రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక వాద సిద్దాంతం పైనే భారత దేశం పని చేస్తోందని చెప్పారు.
ఈ రోజుల్లో ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ సంకీర్ణ సర్కార్ ఇందుకు విరుద్దంగా పని చేస్తోందన్నారు. ప్రధానంగా లౌకిక వాదాన్ని ధ్వంసం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
దీనిపై కొంత మంది ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య మతపరమైన ఉద్రిక్తలు సృష్టించేందుకు వివిధ ప్రాంతాలలో అనేక సర్వేలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు.
Also Read : చరిత్ర నిజం దానిని మార్చలేం – భగవత్