Menstrual Leave Womens : మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు

ఆదేశాలు జారీ చేసిన సీపీఎం ప్ర‌భుత్వం

Menstrual Leave Womens : కేర‌ళ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో స‌గానికి పైగా ఉన్న మ‌హిళ‌ల‌కు ప్ర‌తి నెల నెలా వ‌చ్చే నెల‌స‌రి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. వారి ఇబ్బందుల‌ను మొద‌ట‌గా గుర్తించింది కేర‌ళ ప్ర‌భుత్వం. ఇందులో భాగంగా మ‌హిళలు, యువ‌తులు, బాలిక‌లకు నెల‌స‌రి స‌మ‌యంలో సెల‌వులు(Menstrual Leave Womens)  మంజూరు చేసేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాల‌యాల‌లో ఉన్న‌త చ‌దువులు చ‌దువుతున్న విద్యార్థినుల‌కు నెల‌స‌రి స‌మ‌యంలో సెల‌వులు ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది కేర‌ళ ప్ర‌భుత్వం. దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది కేర‌ళ‌. అన్ని యూనివ‌ర్శిటీల‌లో చ‌దువుకుంటున్న వారికి ఈ వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది.

ఇందులో భాగంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మహిళా విద్యార్థుల‌కు నెల‌స‌రి సెల‌వులు ఇవ్వాల‌ని కేర‌ళ‌లోని కొచ్చిన్ యూనివ‌ర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ముందుగా నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యాన్ని మేం స్వాగ‌తిస్తున్నాం. ఇందుకు ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నామ‌ని కేర‌ళ స‌ర్కార్ తెలిపింది.

ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్శిటీల‌లో నెల‌స‌రి సెల‌వులు ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసినంట్లు కేర‌ళ విద్యా శాఖ మంత్రి ఆర్. బిందు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం కేర‌ళ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే వెసులుబాటును దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని విద్యార్థినులు కోరుతున్నారు.

ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా మ‌హిళ‌లు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ , అసంఘ‌టిత రంగాల‌లో ప‌ని చేస్తున్న కోట్లాది మంది మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి రోజుల్లో సెలవులు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

Also Read : సింగ్’ వేధించ‌డంలో కింగ్

Leave A Reply

Your Email Id will not be published!