KN Balagopal : నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై జీఎస్టీ విధించం

కేంద్ర స‌ర్కార్ కు తేల్చి చెప్పిన కేర‌ళ

KN Balagopal : కేంద్ర స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంపై ఇప్ప‌టికే వ్యాపారులు, ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలంటూ చేసిన ప్ర‌తిపాద‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు కేర‌ళ స‌ర్కార్ ప్ర‌క‌టించింది.

చిన్న చిన్న దుకాణాల ద్వారా విక్ర‌యించే నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై త‌మ ప్ర‌భుత్వం ఎలాంటి జీఎస్టీ విధించ‌ద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కుటుంబ శ్రీ వంటి సంస్థ‌లు లేదా చిన్న దుకాణాల‌లో 1 లేదా 2 కిలోల ప్యాకెట్ల‌లో లేదా వ‌దులుగా ఉండే ప‌రిమాణంలో విక్ర‌యించే వ‌స్తువుల‌పై ప‌న్ను విధించాల‌ని భావించ‌డం లేద‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్ల‌డించారు.

నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై జీఎస్టీ విధించ‌డంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జోక్యం చేసుకోవాల‌ని డిమాండ్ చేశారు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్. ఇప్ప‌టికే నిత్యావ‌సరాల‌పై వ‌స్తు సేవ‌ల ప‌న్ను విధించ‌డం దారుణ‌మ‌ని నిప్పులు చెరుగుతున్నారు వ్యాపారులు.

ఈ నిర్ణ‌యం వ‌ల్ల కేంద్ర స‌ర్కార్ తో స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని, అయితే రాజీకి రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్దంగా లేద‌ని మంత్రి కేఎన్ బాల‌గోపాల్ అసెంబ్లీకి తెలిపారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిపై ఇప్ప‌టికే కేంద్రానికి లేఖ కూడా రాసింద‌ని చెప్పారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేద‌న్నారు.

త‌మ ప్ర‌భుత్వం ఎప్పుడూ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకే ప్ర‌యారిటీ ఇస్తుంద‌న్నారు. వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు, వ్య‌క్తుల‌కు, మోసాల‌కు పాల్ప‌డే వారిని ప్రోత్స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు బాల‌గోపాల్(KN Balagopal).

చిన్న త‌ర‌హా వ్యాపారులు, చిన్న దుకాణాల‌పై ఎటువంటి జీఎస్టీ విధ‌ఙంచే ఉద్దేశం త‌న‌కు లేద‌న్నారు మంత్రి.

Also Read : ప్యాకింగ్ ఫుడ్స్ పై జీఎస్టీ అవ‌స‌రం – నిర్మ‌లా

Leave A Reply

Your Email Id will not be published!