Sidique Kappan : చెరసాలను వీడిన సిద్దిక్ కప్పన్
రెండేళ్లుగా జైలులోనే జర్నలిస్ట్
Sidique Kappan : రెండేళ్ల కిందట ఉత్తర ప్రదేశ్ లో అరెస్ట్ అయిన కేరళకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్(Sidique Kappan) ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఆయన 28 నెలల పాటు జైలులోనే గడిపాడు. 20 ఏళ్ల దళిత మహిళపై సామూహిక అత్యాచారంతో పాటు హత్య జరిగి యూపీలో. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక కథనం తయారు చేసేందుకు కేరళ నుంచి యూపీకి వెళుతుండగా సిద్దిక్ కప్పన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్రాస్ వద్ద అదుపులోకి తీసుకోవడంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. సిద్దిక్ కప్పన్ పై దేశ ద్రోహ నేరారోపణలు చోటు చేసుకున్నాయి. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా) కింద అభియోగాలు మోపారు. సిద్దిక్ కప్పన్ పై ఉన్న రెండు కేసుల్లో బెయిల్ రావడంతో నెల రోజుల పాటు జైలులో ఉన్నాడు.
ఈ సందర్భంగా సిద్దిక్ కప్పన్(Sidique Kappan) మీడియాతో మాట్లాడాడు. కఠినమైన చట్టాలకు వ్యతిరేకంగా నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. నాకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్లు నన్ను జైల్లో పెట్టారు. సుదీర్ఘ పోరాటం తర్వాత విడుదల కావడం ఆనందం అనిపించడం లేదు.
తాను చెరసాల్లో ఉండడం వల్ల ఎవరికీ లాభం జరుగుతుందో తనకు అర్థం అవడం లేదన్నారు సిద్దిక్ కప్పన్. లక్నో జైలు నుండి విడుదలయ్యాక కప్పన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇదిలా ఉండగా హత్రాస్ కు వెళుతుండగా అక్టోబర్ 2020లో అరెస్ట్ అయ్యాడు. తాను ఏనాడూ దేశ ద్రోహానికి పాల్పడలేదని స్పష్టం చేశారు సిద్దిక్ కప్పన్.
Also Read : బడా బాబుల కోసమే ఈ బడ్జెట్