Director Sagar : ద‌ర్శ‌కుడు సాగ‌ర్ క‌న్నుమూత

ప‌లు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం

Director Sagar : తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక‌రి వెంట మ‌రొక‌రు వెళ్లి పోతున్నారు. ఇటీవ‌లే దిగ్గ‌జ న‌టులు న‌ట శేఖ‌ర కృష్ణ కాలం చేయ‌గా కైకాల స‌త్య‌నారాయ‌ణ కూడా క‌న్ను మూశారు. ఈ ఏడాదిలో ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టిగా పేరొందిన జ‌మున ఈ లోకాన్ని వీడారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ అలియాస్ విద్యా సాగ‌ర్ రెడ్డి(Director Sagar) తుది శ్వాస విడిచారు.

గ‌త కొంత కాలం నుంచి ఆయ‌న తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఇవాళ త‌న స్వ‌గృహంలో క‌న్ను మూశారు. ఆయ‌న వ‌య‌స్సు 70 ఏళ్లు. చెన్నై లోని త‌న నివాసంలో మృతి చెందిన‌ట్లు కుటుంబీకులు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ద‌ర్శ‌కుడు సాగ‌ర్ ప‌లు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఆయ‌న తీసిన సినిమాల‌లో రాకాసి లోయ , అమ్మ దొంగ‌, స్టూవ‌ర్టుపురం దొంగ‌లు, రామ‌స‌క్క‌నోడు, ఖైదీ బ్ర‌ద‌ర్స్ , అన్వేష‌ణ లాంటి సినిమాల‌ను తీశారు. ఇదిలా ఉండ‌గా ద‌ర్శ‌కుడు విద్యా సాగ‌ర్ రెడ్డి తొలిసారిగా తీసిన సినిమా రాకాసి లోయ‌. ఆయ‌న మ‌ర‌ణంలో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది.

అంద‌రికీ ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. వ‌ర్ద‌మాన న‌టుల‌కు స‌పోర్ట్ గా నిలుస్తూ వ‌చ్చారు ద‌ర్శ‌కుడు సాగ‌ర్(Director Sagar). ఆయ‌న స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన వారు. అంతే కాకుండా తెలుగు సినిమా ద‌ర్శ‌కుల సంఘానికి మూడు సార్లు అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు విద్యా సాగ‌ర్ రెడ్డి. ఇక టాలీవుడ్ కు చెందిన ద‌ర్శ‌కులు, న‌టీ న‌టులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు.

Also Read : తార‌క‌ర‌త్న ఆరోగ్యం ప‌దిలం

Leave A Reply

Your Email Id will not be published!