Kevin Pietersen : ఇంగ్లండ్ బోర్డు నిర్వాకం పీటర్సన్ ఆగ్రహం
ఎడ తెరిపి లేకుండా షెడ్యూల్ పై ఫైర్
Kevin Pietersen : ఓ వైపు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జట్లకు కంటిన్యూగా మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా, మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవలే తాను వన్డే మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ . దీనిపై తీవ్రంగా స్పందించాడు మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్.
ఐసీసీ తలా తోకా లేని బిజీ షెడ్యూల్ కారణంగానే ఆటగాళ్లు తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారని అందుకే తమ కెరీర్ ను త్వరగా ముగిస్తున్నారని పేర్కొన్నాడు.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ బెన్ స్టోక్స్ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా నాసర్ హుస్సేన్ కు మరో క్రికెటర్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) జత కట్టాడు. ఇంగ్లండ్ సౌత్ వేల్స్ క్రికెట్ బోర్డు పై నిప్పులు చెరిగాడు.
బోర్డు నిర్వాకం కారణంగానే ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా బలంగా ఆడలేక పోతున్నారని, ఆటపై ఫోకస్ పెట్టడం లేదన్నాడు. ఇది పూర్తిగా అనాలోచితమైన చర్యగా ఆయన పేర్కొన్నాడు.
బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. కానీ అతడికి సరైన అవకాశం లేకుండా పోయిందని మండిపడ్డాడు పీటర్సన్.
మూడు ఫార్మాట్ లలో ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందని ఇలాగైతే ఐసీసీ, ఈసీబీ పనితీరుపై తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు ఈ మాజీ ఇంగ్లీష్ క్రికెటర్.
ప్రస్తుతం కెవిన్ పీటర్సన్ చేసిన కామెంట్స్ క్రికెట్ రంగంలో కలకలం రేపింది. ఇదే సమయంలో తనను కూడా అకారణంగా టి20లో ఆడకుండా నిషేధం విధించారంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
Also Read : సీఎస్ఏ’ కమిషనర్ గా గ్రేమీ స్మిత్