NIA Raids : ఎన్ఐఏ దాడుల్లో పీఎఫ్ఐ కీల‌క ప‌త్రాలు స్వాధీనం

బాంబ్ మాన్యువ‌ల్స్..మిష‌న్ 2047 ల‌భ్యం

NIA Raids :  కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ దేశ వ్యాప్తంగా చేప‌ట్టిన దాడుల‌లో కీల‌క‌మైన డాక్యుమెంట్లు బ‌య‌ట ప‌డ్డాయి. పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థ‌ల‌న్నింటిపై కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.

రెండు సార్లు చేప‌ట్టిన దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 400 మందికి పైగా పీఎఫ్ఐ(NIA Raids) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేసింది. అంతే కాకుండా ఆఫీసుల్లో బాంబ్ మాన్యువ‌ల్స్ తో పాటు మిష‌న్ 2047 డాక్యుమెంట్ ను స్వాధీనం చేసుకున్నాయి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు.

ఇదిలా ఉండ‌గా బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై పీఎఫ్ఐ వింగ్ సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా మండిప‌డింది. భార‌త రాజ్యాంగంలో పొందు ప‌ర్చిన ప్ర‌జ‌ల హ‌క్కుల‌పై ఉక్కుపాదం మోప‌డ‌మేన‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా పీఎఫ్ఐ మ‌హారాష్ట్ర నాయ‌కుడి నుండి ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ గైడ్ ను విచార‌ణ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. కీల‌క ప‌త్రాల‌తో పాటు బాంబులు ఎలా త‌యారు చేయాల‌న్న మెటీరియ‌ల్ కూడా దొరికిన‌ట్లు తెలిపాయి. పీఎఫ్ఐ కేంద్రం కేర‌ళ‌. అక్క‌డి నుంచి దేశమంత‌టా విస్త‌రించింది.

ఎన్ఐఏతో పాటు ఈడీ క‌లిసి దాడులు చేప‌ట్టాయి. మెరుగైన పేలుడు ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించి ఎలా బాంబులు త‌యారు చేయాల‌నే దానికి సంబంధించిన బుక్ లెట్ లు కూడా త‌మ‌కు ల‌భించిన‌ట్లు తెలిపింది ఎన్ఐఏ.

ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని బారాబంకికి చెందిన పీఎఫ్ఐ నాయ‌కుడు మ‌హ్మ‌ద్ న‌దీమ్ నుండి వీటిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొంది.

Also Read : ఉద్యోగులు..పెన్ష‌న‌ర్ల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!