Assam Mizoram CMs Meet : మిజోరాం..అస్సాం సీఎంల భేటీ
హిమంత బిస్వా శర్మ..జోరంతంగా
Assam Mizoram CMs Meet : అస్సాం..మిజోరాం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. కేంద్రం ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని, ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా చోటు చేసుకున్న వివాదాలను పరిష్కరించు కునేందుకు కృషి చేయాలని ఇరు రాష్ట్రాలకు చెందిన సీఎంలు హిమంత బిస్వా శర్మ, జోర్ మతంగాలకు సూచించింది.
దీంతో ఇరువురు ముఖ్యమంత్రులు(Assam Mizoram CMs) బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సమావేశం కానున్నారు. ప్రత్యేకించి ప్రాధాన్యతతో కూడిన అంశాలతో పాటు వివాదాస్పద అంశాలు చర్చకు రానున్నాయి.
అయితే వచ్చే నెల అక్టోబర్ లో గౌహతిలో జరగనున్న రెండు రాష్ట్రాల సీఎంల చర్చల తదుపరి రౌండ్ ఇంకా ఖరారు కాలేదని మిజోరాం హోం శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.
కాగా హిమంత బిస్వా శర్మ, జోర్ మతంగాలు ఇవాళ భేటీ కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంల ముఖ్య సమావేశం సోమవారం నిర్వహించాల్సి ఉంది.
అయితే హిమంత బిస్వా శర్మ తిరిగి అస్సాం వెళ్లాల్సి రావడంతో మీటింగ్ వాయిదా పడింది. ఇక ఇద్దరు నేతలు కూడా గత ఏడాది 2021 నవంబర్ లో న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) సమంలో సమావేశమయ్యారు.
వివాదాలను పరిష్కరించేందుకు , సీఎం స్థాయి చర్చలు జరిపేందుకు వాటాదారులతో కూడిన ప్యానెల్ ను రూపొందించేందుకు అంగీకరించారు.
కాగా అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్న మిజోరాం హోం శాఖ మంత్రి లాల్ చామ్లియానా తిరిగి వచ్చాక ఈ అంశంపై చర్చించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : విద్వేషాలు రెచ్చగొట్టేందుకే షా టూర్ – తేజస్వి