Ex Minister Kakani : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు పై కీలక అప్డేట్

అలాగే కాకాణిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి అవసరం ఉందని..

Ex Minister Kakani : క్వార్జ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్‌ కస్టడీ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్‌, అలాగే బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 5న (గురువారం) న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కాకాణిని కస్టడీలోకి తీసుకుంటే కేసులో పూర్తి వివరాలు తెలుస్తాయని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. కేసులో ముద్దాయిలు ఇచ్చిన సమాచారం మేరకు కాకాణిని(Ex Minister Kakani) కస్టడీకి తీసుకుంటే లోతైన సమాచారం సేకరించవచ్చన్నారు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారని… పోలీస్ కస్టడీకి ఇస్తారన్న నమ్మకం ఉందని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు.

Ex Minister Kakani Govardhan Reddy Case

క్వార్ట్జ్ స్కాంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో కాకాణి(Ex Minister Kakani) నెల్లూరు సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కావాలంటూ ఈరోజు ఐదో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసును న్యాయస్థానం ఈనెల 5కు వాయిదా వేసింది. అలాగే కాకాణిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి అవసరం ఉందని, ఈ కేసులో ఇప్పటికే చాలా మంది నిందితులు, సాక్షుల వద్ద నుంచి సమాచారాన్ని సేకరించామని, వీటిన్నింటిపై కాకాణిని విచారించాల్సి ఉందంటూ కస్టడీ కోరారు పోలీసులు. ఆ కస్టడీ పిటిషన్‌పై దాదాపు మూడు గంటల పాటు ప్రభుత్వ న్యాయవాదులు, కాకాణి తరఫు న్యాయవాదుల మధ్య వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 5కు వాయిదా వేసింది. కచ్చితంగా కాకాణిని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందని పోలీసుశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాకాణికి కస్టడీకి తీసుకుంటేనే ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ చేయగలిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

కాగా.. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం కేసులో మాజీ మంత్రి కాకాణిని గత నెలలో బెంగళూరు సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కాకాణి ఏ4గా ఉన్నాయి. ఈ కేసు విచారణకు రావాలంటూ కాకాణికి పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. కేసు నమోదైన తర్వాత తాను ఎక్కడికి పోనని.. నెల్లూరులోనే ఉంటానని, విచారణకు సహకరిస్తానని చెప్పిన ఆయన.. ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ అక్కడ కూడా కాకాణికి ఎదురుదెబ్బే తగిలిలింది. దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Also Read : Sharmishta Panoli Case : ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్ కతా హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!