Khaleel Ahmed : ఈసారి ఢిల్లీ క్యాపిట‌ల్స్ దే ఐపీఎల్

ధీమా వ్య‌క్తం చేసిన ఖ‌లీల్ అహ్మ‌ద్

Khaleel Ahmed : ఐపీఎల్ 2022 సంబురం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే ప‌లు జ‌ట్లు విజ‌య ఢంకా మోగించాయి. ఈ త‌రుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆట‌గాడు ఖ‌లీల్ అహ్మ‌ద్ (Khaleel Ahmed)సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈసారి ఐపీఎల్ టైటిల్ త‌మ‌దేనంటూ ధీమా వ్య‌క్తం చేశాడు.

గ‌తంలో మ‌నోడు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడాడు. ప్ర‌స్తుతం రూ. 525 కోట్ల‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఏరికోరి ఎంచుకుంది. గ‌తంలో జ‌రిగిన ఐపీఎల్ లీగ్ ల‌లో ప్లే ఆఫ్స్ కు చేరుకున్న త‌మ జ‌ట్టు ఈసారి స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌ని, క‌ప్ మాత్రం త‌మ‌దేన‌ని స‌వాల్ విసిరాడు.

ఎందుకంటే త‌మ జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్ నాయ‌క‌త్వంలో అద్భుత‌మైన ప్ర‌తిభా పాటవాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు రెడీగా ఉంద‌న్నాడు. ఇక ఐపీఎల్ రిచ్ లీగ్ లో భాగంగా ఫ‌స్ట్ మ్యాచ్ ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగింది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇందులో ఖ‌లీల్ అహ్మ‌ద్ 27 ర‌న్స్ ఇచ్చి రెండు కీల‌క వికెట్లు తీశాడు. మేమిద్ద‌రం క‌లిసి ఆడాం. మ‌రోసారి ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని పేర్కొన్నాడు ఖ‌లీల్ అహ్మ‌ద్(Khaleel Ahmed).

ఎవ‌రికీ అంద‌డు రిష‌బ్ పంత్ అని పేర్కొన్నాడు. కెప్టెన్ గా ఇప్ప‌టికే వంద మార్కులు కొట్టేశాడ‌ని కితాబు ఇచ్చాడు. త‌మ‌ను త‌ట్టు కోవ‌డం ఏ జ‌ట్టుకు సాధ్యం కాద‌ని ధీమా వ్య‌క్తం చేశాడు ఖ‌లీల్ అహ్మ‌ద్.

త‌మ జ‌ట్టు అన్ని రంగాల‌లో స‌త్తా చాటేందుకు రెడీగా ఉంద‌ని పేర్కొన్నాడు.

Also Read : తిప్పేసిన హ‌స‌రంగ త‌ల‌వంచిన కేకేఆర్

Leave A Reply

Your Email Id will not be published!