Amrit Pal Singh Arrest : ఖ‌లిస్తాన్ లీడ‌ర్ అమృత్ పాల్ అరెస్ట్

పంజాబ్ రాష్ట్రంలో టెన్ష‌న్ టెన్ష‌న్

Amrit Pal Singh Arrest : రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ముప్పుగా ప‌రిణ‌మించిన ఖ‌లిస్తాన్ లీడ‌ర్ అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ‌నివారం జ‌లంధ‌ర్ లోని నకోద‌ర్ స‌మీపంలో అదుపులోకి తీసుకున్నారు. అమృత్ పాల్ సింగ్ తో(Amrit Pal Singh Arrest)  పాటు మ‌రో ఆరుగురిని కూడా అరెస్ట్ చేయ‌డంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో రాష్ట్రంలోని వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగ‌డంతో ఖాకీలు రంగంలోకి దిగారు. పోలీసులు భారీగా మోహ‌రించారు.

అంతే కాదు ఇంట‌ర్నెట్ ను కూడా బంద్ పెట్టారు. మార్చి 19న ఆదివారం సాయంత్రం దాకా ఇంట‌ర్నెట్ సేవ‌లు కూడా నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల త‌న అనుచ‌రుడిని అరెస్ట్ చేయ‌డంపై అమృత్ పాల్ సింగ్ అనుచ‌రులు బీభ‌త్సం సృష్టించారు. దాడుల‌కు దిగారు. పోలీసులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా పంజాబ్ సీఎం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. భారీ ఎత్తున రాష్ట్రంలో గ‌న్ లైసెన్సులు ఉన్నాయి.

ఇందులో 800 లైసెన్సుల‌ను ర‌ద్దు చేసింది. నేర ర‌హిత‌, అవినీతి ర‌హిత పంజాబ్ ను చేయ‌డమే త‌న ముందున్న లక్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఇదిలా ఉండ‌గా అమృత్ పాల్ సింగ్ పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయి. ఆనాటి నుంచి ప‌రారీలో ఉన్న సింగ్ ను ఇవాళ అదుపులోకి తీసుకోవ‌డంతో ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉంది. ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు పోలీసులు. అమృత్ పాల్ సింగ్(Amrit Pal Singh) తో పాటు అనుచ‌రుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : మీడియా గీత దాటితే జాగ్ర‌త్త – ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!