Kidambi Srikanth : ఈ విజయం సమిష్టి కృషికి సంకేతం
బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్
Kidambi Srikanth : యావత్ భారతానికి సంతోషాన్ని కలిగించేలా భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. 73 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత భారత జట్టు తొలిసారిగా థామస్ కప్ చేజిక్కించుకుంది. స్వర్ణాన్ని సాధించింది.
ఏకంగా 14 సార్లు ఛాంపియన్ గా నిలిచి తనకంటూ ఎదురే లేదని అనుకున్న ఇండోనేషియాను థాయ్ లాండ్ వేదికగా జరిగిన ఫైనల్ లో 3-0 తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది. వ్యక్తిగతంగా , డబుల్స్ లో వరుసగా గెలుస్తూ అరుదైన ఘనతను సాధించారు.
థామస్ కప్ ను గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth). విజయం సాధించాక ఆటగాళ్లు పట్టరాని సంతోషంతో స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా కిదాంబి స్పందించాడు.
ఈ విజయం దేశానికి అంకితం ఇస్తున్నామని అన్నాడు. సమిష్టి కృషి ఫలితానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నాడు. క్రీడా చరిత్రలో భారత దేశం ఎన్నడూ ఫైనల్ కు అర్హత సాధించ లేదు. వారు అన్ని అసమానతలను అధిగమించి దేశాన్ని సంతోషంలో ముంచెత్తేలా చేశారు.
ఆట కంటే దేశం గొప్పదన్నాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth). ఒక జట్టుగా ఆడడం గొప్ప అనుభవాన్ని ఇచ్చిందన్నాడు. తమకు అత్యుత్తమ జట్టు ఉందన్నాడు. ముఖ్యమైన ఫైనల్ మ్యాచ్ లో తామంతా శక్తియుక్తులన్నింటని కేంద్రీకరించి ఆడామని చెప్పాడు.
ప్రతి ఒక్కరు ప్రదర్శించిన తీరుకు చాలా సంతోషంగా ఉందన్నాడు శ్రీకాంత్. టోర్నీకి ముందు జట్టు వాట్సాప్ గ్రూప్ ను తయారు చేసిందన్నాడు.
దానికి ఇట్స్ కమింగ్ హోమ్ అని పేరు పెట్టామన్నాడు. తమను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు శ్రీకాంత్.
Also Read : 1983ని గుర్తు చేసిన థామస్ కప్ : సన్నీ