Kinnera Mogulaiah : అవార్డుపై రాజ‌కీయం కిన్నెర మ‌న‌స్తాపం

ప‌ద్మ‌శ్రీ బీజేపీ వాళ్ల‌దంట - మొగులయ్య

Kinnera Mogulaiah : ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన మెట్ల కిన్నెర‌ను వాయిస్తున్న మొగుల‌య్య మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఆయ‌న త‌క్కువ స‌మ‌యంలోనే పాపుల‌ర్ అయ్యాడు.

12 మెట్ల కిన్నెర‌ను వాయిస్తున్న ఏకైక క‌ళాకారుడు తెలంగాణ రాష్ట్రంలో ఆయ‌న ఒక్క‌రే. ఈ మ‌ధ్య‌న మొగుల‌య్య(Kinnera Mogulaiah) మ‌రింత ఆద‌ర‌ణ పొందాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమాకు టైటిల్ సాంగ్ పాడాడు.

దీంతో ఒక్క‌సారిగా మొగుల‌య్య సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా మారారు. సినిమా ఫంక్ష‌న్ స‌మ‌యంలోను మొగుల‌య్య‌ను పిలిచి స‌న్మానించారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఆద‌రించారు. అన్ని రంగాల‌కు చెందిన వారంతా కిన్నెర‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించారు.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేవీ ర‌మ‌ణాచారి, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి మామిడి హ‌రికృష్ణ మొగుల‌య్య‌ను(Kinnera Mogulaiah) ప్ర‌మోట్ చేశారు. ఇక ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ మొగుల‌య్య‌కు జీవిత కాలం ఉచితంగా ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించారు.

ఇదే స‌మ‌యంలో క‌ళాకారుడిగా అంత‌రించి పోతున్న మెట్ల కిన్నెర‌కు ప్రాణం పోసిన మొగుల‌య్య‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అత్యున్న‌త ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ఆయ‌ను అభినందించారు. ఇదే స‌మ‌యంలో మొగుల‌య్య‌కు రూ. కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. 300 గ‌జాల స్థ‌లాన్ని కేటాయించారు.

దీంతో బీజేపీ వాళ్లు త‌న‌తో వాగ్వాదానికి దిగార‌ని, ఈ ప‌ద్మ‌శ్రీ వాళ్ల‌ద‌ని అంటున్నారంటూ వాపోయాడు. కావాలంటే ప‌ద్మ‌శ్రీ‌ని తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య మొగుల‌య్య ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది.

Also Read : మోదీపై భార‌తీయుల‌కు న‌మ్మ‌కం ఎక్కువ‌

Leave A Reply

Your Email Id will not be published!