Kiren Rijiju Vs Judiciary : న్యాయ వ్యవస్థ వర్సెస్ కిరెన్ రిజిజు
వివాదాస్పద వ్యాఖ్యలపై గరం గరం
Kiren Rijiju Vs Judiciary : ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకు పోయే కేంద్ర మంత్రుల్లో ఒకరిగా పేరొందారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు. ప్రస్తుతం ఆయన న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధానంగా తన శాఖ పరిధిలోకి వచ్చే రంగంపై చులకన కామెంట్స్ చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
జడ్జీలు వాళ్లు తమకు కేటాయించిన పనులు చేయడం లేదు. కానీ మిగతావన్నీ చేస్తున్నారని ఆరోపించారు కిరెన్ రిజిజు. ఆపై వాళ్లు రాజకీయాలు
చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. కొందరు ఉన్నంత మాత్రాన అందరినీ ఒకే గాటన కట్టేస్తే ఎలా అంటోంది న్యాయ వ్యవస్థ.
దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ భారత దేశంలో ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన పత్రిక పాంచజన్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిరెన్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇదే ప్రధాన టాపిక్ గా మారి పోయింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన వాళ్లు పాలిటిక్స్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఆయన ప్రధానంగా కొలీజియం వ్యవస్థను ఎత్తి చూపారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు నలుగురు న్యాయమూర్తులు ఉంటారు ఇందులో. వీరు
ఎంపిక చేసిన వారిని కేంద్ర న్యాయ శాఖకు పంపిస్తుంది. అటు నుంచి కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతుంది. చివరగా ఆమోద ముద్ర వేసేది మాత్రం భారత రాష్ట్రపతి.
ఇది గత కొంత కాలం నుంచీ కొనసాగుతూ వస్తున్న వ్యవస్థ. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు కిరెన్ రిజిజు. దేశంలో లక్షలాది కేసులు మిగిలి పోయాయి. వాటిని పరిష్కరించకుండా ఎవరిని నియమించాలన్న దానిపై విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా లేదంటూ మండిపడ్డారు కిరెన్ రిజిజు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదన్నారు. పూర్తిగా
మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టుల్లో కంటికి కనిపించని పాలిటిక్స్ చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
న్యాయ వ్యవస్థ ప్రధాన విధి ప్రజలకు న్యాయం అందించడం న్యాయమూర్తులను నియమించడం కాదన్నారు కిరెన్ రిజిజు. సుప్రీంకోర్టులో 40 మందితో
కూడిన ఓ గ్రూపు ఆధిపత్యం చెలాయిస్తోందంటూ ఆరోపించారు.
కేంద్ర మంత్రి చేసిన కామెంట్స్ పై జడ్జీలు, న్యాయవాదులు భగ్గుమంటున్నారు. ఏది ఏమైనా కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలను పునరాలోచించాల్సిన అవసరం ఎందైనా ఉంది.
Also Read : రేప్ లు చేసేందుకు విడుదల చేశారా – సీఎం