Kitex Group Invest : తెలంగాణ‌లో కిటెక్స్ గ్రూప్

భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్

Kitex Group Invest : హైద‌రాబాద్ – ప్ర‌పంచం లోనే పిల్ల‌ల దుస్తుల త‌యారీదారు సంస్థ‌ల‌లో టాప్ లో కొన‌సాగుతోంది కిటెక్స్ గ్రూప్. స‌ద‌రు బిగ్ కంపెనీ ప్ర‌స్తుతం తెలంగాణ‌ను ఎంచుకుంది. ఈ మేర‌కు గురువారం త‌యారీ ప‌రిశ్ర‌మ‌కు శంకుస్థాప‌న చేశారు కంపెనీ ప్ర‌తినిధితో పాటు ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్.

Kitex Group Invest in HYD

స‌ద‌రు కంపెనీ ఏర్పాటు వ‌ల్ల 11,000 మందికి జాబ్స్ వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది కిటెక్స్ కంపెనీ. వ‌ర్క్ ఫోర్స్ లో 80 శాతం మ‌హిళ‌లు ఉండేలా చూస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా కిటెక్స్ గ్రూప్ ప్ర‌పంచంలో రెండ‌వ అతి పెద్ద కిడ్స్ వేర్ త‌యారీదారుగా పేరు పొందింది.

కిటెక్స్ కంపెనీ గ‌నుక పూర్త‌యితే రోజుకు 7 ల‌క్ష‌ల వ‌స్త్రాల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. ఫైబ‌ర్ టు దుస్తుల త‌యారీ క్ల‌స్ట‌ర్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ కిటెక్స్ గ్రూప్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

తెలంగాణ‌లో ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు మంత్రి. రాబోయే రోజుల్లో మ‌రికొన్ని దిగ్గ‌జ కంపెనీలు రానున్నాయ‌ని పేర్కొన్నారు కేటీఆర్(KTR). పెద్ద ఎత్తున ఉపాధి ల‌భిస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు.

Also Read : Balakrishan Goenka : కేటీఆర్ వ‌ల్ల‌నే సింటెక్స్ ప్లాంట్

Leave A Reply

Your Email Id will not be published!