Balakrishan Goenka : కేటీఆర్ వ‌ల్ల‌నే సింటెక్స్ ప్లాంట్

చైర్మ‌న్ బాల‌క్రిష‌న్ గోయెంకా

Balakrishan Goenka : హైద‌రాబాద్ – వెల్స‌న్ గ్రూప్ , సింటెక్స్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ప్లాంట్ చైర్మ‌న్ బాల‌క్రిష‌న్ గోయెంకా షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. 2018లో గుజ‌రాత్ లో ఉండాల్సిన త‌మ ఫ్లోరింగ్ ప్లాంట్ ను ఇక్క‌డ ఏర్పాటు చేసేలా కేటీఆర్ త‌మ‌ను ఒప్పించార‌ని చెప్పారు.

Balakrishan Goenka Praises KTR

వాస్త‌వానికి క‌ర్ణాట‌క‌లో తాము సింటెక్స్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాల‌ని అనుకున్నామ‌ని కానీ కేటీఆర్ ప్ర‌య‌త్నం వ‌ల్ల త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు బాల‌క్రిష‌న్ గోయెంకా(Balakrishan Goenka). అక్క‌డి కంటే తెలంగాణ ప్ర‌భుత్వం ఎక్కువ‌గా త‌మ వైపు నిలబ‌డిన విధానం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని స్ప‌ష్టం చేశారు.

అందుకే తాము స‌డెన్ గా త‌మ నిర్ణ‌యాన్ని మార్చు కోవాల్సి వ‌చ్చిందని చెప్పారు వెల్స‌న్ గ్రూప్ చైర్మ‌న్. ఇదిలా ఉండ‌గా తెలంగాణలో పెద్ద ఎత్తున ఐటీ, లాజిస్టిక్, ఫార్మా కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం రాష్ట్ర స‌ర్కార్ . తీసుకున్న నిర్ణ‌యాలు వ్యాపార‌వేత్త‌లు, కంపెనీల‌కు లాభ దాయ‌కంగా మారాయి.

దీంతో దిగ్గ‌జ కంపెనీలు క్యూ క‌డుతున్నాయి.

Also Read : HYD Police Dance : గ‌ణేశ్ శోభ‌యాత్ర‌లో పోలీసుల డ్యాన్స్

Leave A Reply

Your Email Id will not be published!