Singer KK : కేకే..తడప్ తడప్ కే ఇస్ దిల్ సే
గుండెల్ని పిండేసిన ఆ స్వరం
Singer KK : అల్లా రఖా రెహమాన్ వల్ల ఎందరో గాయనీ గాయకులు సినీ భారతంలో తారలై మెరిశారు. అలాంటి సినీ గాయకులలో పరిచయం చేసిన ఆ స్వరమే కేకే. 3,500 దాకా జింగిల్స్ పాడాడు.
కేకేలోని జీర బోయిన గొంతును పసిగట్టాడు రెహమాన్. కేకే అంటేనే హమ్ దిల్ దేచుకే సనమ్ మూవీ. ఆ సినిమా అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది కేకే విషాదంతో ప్రియురాలి కోసం పాడిన పాట తడప్ తడప్ పాట.
ఇప్పటికీ యూట్యూబ్ జనాదరణ పొందిన పాటలలో ఒకటిగా నిలిచింది. అంతలా హత్తుకునేలా పాడాడు కేకే(Singer KK). తడప్ తడప్ నుండి అప్పాడి పోడు వరకు ఎన్నో గుర్తుంచుకునే పాటల్ని మన కోసం వదిలేసి వెళ్లి పోయాడు.
1999లో లెస్లే లూయిస్ తో కలిసి పాల్ అనే సోలో ఆల్బమ్ తో సంగీత పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. హమ్ సఫర్ ఆల్బమ్ కు ప్రశంసలు పొందాడు. 1999 కేకే కెరీర్ లో అతి పెద్ద మైలురాయిగా చెప్పవచ్చు.
పాల్ ఆల్బమ్ సక్సెస్ అయ్యింది. అదే ఏడాదిలో సల్మాన్ ఖాన్ , ఐశ్వర్యా రాయ్ కలిసి నటించిన హమ్ దిల్ దే చుకే సనమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇందులో పాడిన తడప్ తడప్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ గా పేరొంది. ఎన్నో అవార్డులు వచ్చాయి కేకేకు. లెస్లే లూయిస్ తో కలిసి రాక్ ఫోర్డ్
నుండి యారోన్ దోస్తీ కోసం పని చేశాడు.
కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా చిత్రం పాడాడు కేకే. ఇక ఫర్హాన్ అక్తర్ రచించి, దర్శకత్వం వహించిన దిల్ చాహ్తా హై చిత్రంలో మరుపురాని పాట
పాడాడు. కేకే, శంకర్ మహదేవన్ కలిసి పాడారు.
కోయి కహే కెహతా రహే సాంగ్ హిట్. ఇక సంజయ్ లీలా భన్సాలీ తీసిన దేవదాస్ లో డోలా రే డోలా సాంగ్ మరింత పేరు తీసుకు వచ్చింది కేకేకు. ఈ పాటను శ్రేయా ఘోషల్, కవితా కృష్ణమూర్తి, కేకే కలిసి పాడారు.
హుమ్రాజ్ లో బర్దాష్ట్ సాంగ్ బిగ్ హిట్. ఇక కోలీవుడ్ లో కాఖా కాఖాలో ఉయిరిన్ ఉయిరే సాంగ్ దుమ్ము రేపింది. గౌతమ్ వాసుదేవన్ మీనన్ తొలి
హిట్లలో ఒకటిగా నిలిచింది.
గిల్లిలో అప్పాడి పోడు సూపర్ గా నిలిచింది. కేకే(Singer KK), అనురాధా శ్రీరామ్ పాడారు. మన్మధన్ లో కాదల్ వలార్థేన్ పాడిన పాట కేకేకు
మరింత పేరు తీసుకు వచ్చింది. వసూల్ రాజా ఎంబీబీఎస్ లో శ్రేయాతో కలిసి పాడాడు కేకే.
Also Read : వెచ్చని జ్ఞాపకం స్వర మాధుర్యం