CSK vs KKR : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 2022 అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ (CSK vs KKR) ఘన విజయాన్ని నమోదు చేసింది.
అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను సత్తా చాటింది. బ్యాటింగ్ లో మరోసారి ధోనీ , బ్రేవో మెరిసినా తమ జట్టును గెలిపించ లేక పోయారు.
ఇక కోల్ కతా నైట్ రైడర్స్ ఉమేష్ యాదవ్ మెరుపులు మెరిపిస్తే అజింక్యా రహానే రాణించడంతో ఈజీగా విజయం నమోదు చేసింది.
లీగ్ మ్యాచ్ లో భాగంగా కేకేఆర్ కు తొలిసారిగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
అతడి అంచనాను నిజం చేస్తూ బౌలర్లు సత్తా చాటారు. పరుగులు చేయకుండా ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు.
ఈసారి బీసీసీఐ 25 శాతం మంది ప్రేక్షకులకు పర్మిషన్ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆట పూర్తిగా ఏకపక్షంగా సాగిందనే చెప్పక తప్పదు. ఇక టాస్ ఓడి పోయి బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.
ధోనీ 7 ఫోర్లు ఓ సిక్సర్ తో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే రాబిన్ ఊతప్ప 28, రవీంద్ర జడేజా 26 పరుగులు చేశారు. రుతురాజ్ సున్నాకే వెనుదిరిగితే కాన్వే 3, రాయుడు 15 , శివమ్ దూబే 3 రన్స్ చేసి నిరాశ పరిచారు.
అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 18.3 ఓవర్లలో 133 పరుగులు చేసి విక్టరీ సాధించింది. అజింక్యా రహానే 6 ఫోర్లు ఓ సిక్సర తో 44 పరుగులు చేసి రాణఙంచాడు.
బిల్లింగ్స్ 25, నితీష్ రాణా 21, శ్రేయస్ అయ్యర్ 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై , పంజాబ్ తో బెంగళూరు తలపడనున్నాయి.
Also Read : పాకిస్తాన్ పరాజయం పరిసమాప్తం