KKR vs GT IPL 2023 : కోల్ క‌తా గుజ‌రాత్ బిగ్ ఫైట్

స‌మ ఉజ్జీల పోరుకు రెఢీ

KKR vs GT IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా శ‌నివారం కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్ టైటాన్స్ 7 మ్యాచ్ లు ఆడింది. 5 మ్యాచ్ ల‌లో గెలుపొంద‌గా 2 మ్యాచ్ ల‌లో ఓడి పోయింది. ప్ర‌స్తుతం ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ 3వ స్థానంలో నిలిచింది.

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్(KKR vs GT IPL 2023) 8 మ్యాచ్ లు ఆడింది. 3 మ్యాచ్ ల‌లో మాత్ర‌మే గెలుపొందింది. 5 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా ఓట‌మి పాలైంది. కోల్ క‌తాకు సానుకూల అంశం ఏమిటంటే స్వంత గ్రౌండ్ లో మ్యాచ్ ఆడ‌డం. కోల్ క‌తా ప్లే ఆఫ్ కు చేరాలంటే ప్ర‌తి మ్యాచ్ గెలుపొందాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఇరు జ‌ట్లు అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో స‌మానంగా పైకి క‌నిపించినా పైకి గుజ‌రాత్ టైటాన్స్ కోల్ క‌తా కంటే ముందంజ‌లో ఉంది.

ఇక ఐపీఎల్ లో కోల్ క‌తా, గుజ‌రాజ్ జ‌ట్టురెండు సార్లు మాత్ర‌మే త‌ల‌ప‌డ్డాయి. గ‌త సీజ‌న్ లో గుజ‌రాత్ టైటాన్స్ 8 ప‌రుగుల తేడాతో కోల్ క‌తాను ఓడించింది. ఈ ఏడాది జ‌రిగిన లీగ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ భారీ స్కోర్ చేసింది. 3 వికెట్ల తేడాతో గుజ‌రాత్ టైటాన్ ను ఓడించింది. దీంతో ఇవాళ జ‌రిగే మ్యాచ్ మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. మొత్తంగా చూస్తే ఒక‌టి గుజ‌రాత్ గెలిస్తే మ‌రొక‌టి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించి స‌మానంగా నిలిచాయి. ఇవాళ జ‌రిగే కీల‌క మ్యాచ్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Also Read : ల‌క్నో జోర్ దార్ పంజాబ్ బేజార్

Leave A Reply

Your Email Id will not be published!